'శాస్త్ర, సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యం'

author img

By

Published : May 13, 2022, 1:26 PM IST

KTR on 3D Printing

KTR on 3D Printing: వైద్యరంగంలో మెరుగైన ఫలితాలు సాధించటంలో త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్​ఐసీసీలో వైద్య పరికరాలు, ఇంప్లాంట్​ల త్రీడీ ప్రింటింగ్​పై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు కేటీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్​లో వైద్య పరికరాల త్రీడీ ప్రింటింగ్ రంగంలో భారీగా అవకాశాలు ఉన్నాయన్న మంత్రి .. త్వరలో అందుబాటులోకి రానున్న టీ హబ్ కొత్త బ్లాక్​లో త్రీడీ ప్రింటింగ్ కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనన్నట్టు ప్రకటించారు.

శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యం: కేటీఆర్‌

KTR on 3D Printing: హెల్త్‌కేర్‌ త్రీడీ ప్రింటింగ్‌లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. ఇప్పటికే టీ- హబ్‌లో త్రీడీ ప్రింటింగ్‌ ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. టీ- వర్క్స్‌ ద్వారా అనేక ప్రోటోటైప్స్‌ రూపొందిస్తున్నామని వెల్లడించారు. కరోనా సమయంలో టీ వర్క్స్​ మెకానికల్​ వెంటిలేటర్​ను రూపొందించిందని వివరించారు. హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో... మెడికల్‌ డివైజెస్‌, ఇంప్లాంట్స్‌లో త్రీడీ ప్రింటింగ్‌పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్​ పాల్గొన్నారు.

త్రీడీ ప్రింటింగ్‌తో వైద్యసేవలు మరింత మెరుగుపర్చవచ్చని కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. యూఎస్​, యురోపియన్‌ మార్కెట్లలో ఇప్పటికే ఈ సాంకేతిక దూసుకుపోతోందన్న కేటీఆర్​... భారత్‌లోనూ అభివృద్ధికి చక్కటి అవకాశముందని వెల్లడించారు. ఉస్మానియాలో ఏర్పాటుకాబోతున్న నేషనల్‌ సెంటర్ ఫర్‌ అడిటివ్‌ మ్యాన్యుఫ్యాక్షరింగ్ సెంటర్‌తో ఈ రంగంలో దేశం పురోగతి సాధిస్తుందని కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు.

"నవ్య సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపే లక్ష్యంలో భాగంగా 3- డీ ప్రింటింగ్‌పై దృష్టిసారించాం. 3-డీ ప్రింటింగ్‌ ద్వారా సర్జన్లు, రోగులకు వైద్యసేవలను మరింత మెరుగుపర్చే అవకాశం ఏర్పడుతుంది. ఆర్థికంగా హెల్త్‌కేర్‌ 3-డీ ప్రింటింగ్‌ మార్కెట్‌ విలువ 2020లో 1.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2027 కల్లా ఇది 7.1 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఈ రంగం అభివృద్ధికి ప్రధాన కారణం.. ఆర్థోపెడిక్‌, డెంటల్‌తో పాటు పలు విభాగాల రోగుల్లో ఇంప్లాంట్లకు డిమాండ్‌ పెరగడం. ప్రస్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భారత్‌కు చక్కటి అవకాశముంది. ఈ రంగంలో కీలక సంస్థలను ఎన్‌సీఏఎమ్‌ గుర్తించే ఈ సదస్సు మైలురాయిగా నిలిచిపోతుంది. ఎన్‌సీఏఎమ్‌ ఉస్మానియా క్యాంపస్‌లో రావడం గర్వకారణం." -కేటీఆర్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

సదస్సులో త్రీడీ ప్రింటింగ్ వృద్ధికి సంబంధించి పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణంలో నేషనల్ సెంటర్ ఫర్ అడెటివ్ మ్యూనుఫ్యాక్చరింగ్(NCAM) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం, ఉస్మానియా వర్శిటీల మధ్య ఒప్పందం కుదిరినట్టు వివరించారు. యూఎస్ఎఫ్​డీఏ ఇప్పటికే 100కు పైగా త్రీడీ ప్రింటింగ్ చేసిన వైద్య పరికరాలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, నేషనల్ సెంటర్ ఫర్ ఎడెటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్టర్ రమాదేవి లంకా, మిషెలే వేస్ట్ విక్టోరియా స్టేట్ సెక్రటరీ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: CM KCR On Rajya sabha: భాషా పరిజ్ఞానం గల వారివైపే మొగ్గు...

నూనె, పాలు, గుడ్లు, చికెన్ ధరలు ఒక్కసారే ట్రిపుల్- ఆ దేశంలో కల్లోలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.