ETV Bharat / state

లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్

author img

By

Published : Mar 25, 2022, 7:15 PM IST

లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్
లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్

KTR America Tour news: అమెరికాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. బోస్టన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్... లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు.

KTR America Tour news: రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన కొనసాగుతోంది. బోస్టన్ నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి..... లైఫ్ సైన్సెస్ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం గురించి వివరించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

పాలసీ పరమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్‌కు సంబంధించి ప్రత్యేక ఫండ్, జీనోమ్ వ్యాలీలో ఇంకుబేటర్ లాంటి కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. వీటింటిన్నికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని వివరించారు. బయో లైఫ్ సైన్సెస్ ఫార్మా ఉత్పత్తులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

  • Speaking at a life Sciences Roundtable meeting in Boston, Minister @KTRTRS gave an overview of the comprehensive Life Sciences ecosystem existing in Telangana State and also highlighted the investment opportunities for global pharma and medtech companies. pic.twitter.com/HOUwGHMdfV

    — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : KTR IN US: దేశానికే గర్వకారణం తెలంగాణ: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.