ETV Bharat / state

వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరపలేకపోతున్నాం: కేటీఆర్

author img

By

Published : Apr 26, 2021, 8:13 PM IST

ఏప్రిల్​ 27న తెరాస 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జెండాను ఎగరవేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సూచించారు. ప్రతి ఇంటిపై గులాబీ జెండాను ఎగరవేద్దామని పిలుపునిచ్చారు.

 trs anniversary, ktr
trs anniversary, ktr

కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరపలేకపోతున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. మంగళవారం నాడు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి జిల్లా, మండలం, పట్టణం, గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని నేతలకు పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండాను ఆవిష్కరించాలన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించి.. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామన్నారు. గులాబీ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేద్దామన్న ఆయన... ఆత్మగౌరవాన్ని చాటుదామని పిలుపునిచ్చారు. రేపు తెలంగాణ భవన్​లో తెరాస సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు జెండా ఎగరవేయనున్నారు.

ఇదీ చూడండి: 'ఆక్సిజన్​ వినియోగంలో ఆ రంగాలకు మినహాయింపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.