ETV Bharat / state

KTR Laid Foundation Stone for E-Positive Energy Labs In Rangareddy : 'ప్రతిరోజు కొత్తదనం కోరుకోవడంతోనే ముందంజలో అమర రాజా'

author img

By

Published : Aug 11, 2023, 5:13 PM IST

E-Positive Energy Labs In Rangareddy
KTR Laid Foundation Stone E-Positive Energy Labs

KTR Laid Foundation Stone for E-Positive Energy Labs In Rangareddy : రాష్ట్రంలో అమర రాజా బ్యాటరీస్​ లిమిటెడ్​ నూతనంగా నిర్మిస్తున్న ఈ పాజిటివ్​ ఎనర్జీ ల్యాబ్స్​కు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. అలాగే అగ్రికల్చరల్​ డేటా ఎక్స్ఛేంజ్​ సెంటర్​ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడారు.

KTR Laid Foundation Stone for E-Positive Energy Labs In Rangareddy : కొవిడ్ వ్యాక్సిన్​లో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిన తరహాలో ఈ-మొబిలిటీలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ఈ-బ్యాటరీల్లో 60 శాతం తెలంగాణలోనే తయారవుతాయన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్(Amara raja Batterie LTD) నూతనంగా నిర్మిస్తున్న ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్(E-Positive Energy Labs)​కు అమరాజా ఛైర్మన్ గల్లా జయదేవ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, నీతిఅయోగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సలహాదారు సుధేందు సిన్హాలతో కలిసి మంత్రి కేటీఆర్​ భూమి పూజ చేశారు.

Amar Raja E-Positive Energy Labs : ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్​ మొబిలిటీ రంగం(Electric mobility sector)లో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గల్లా జయదేవ్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు అంతా సస్టెనెబులిటీదేనని పేర్కొన్నారు. ప్రతిరోజు కొత్తదనం కోరుకోవడంతోనే అమరరాజా సంస్థ ముందుంటుందని చెప్పారు.

KTR Foundation E-Positive Energy Labs : తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిన తర్వాత.. ఎన్నో గొప్ప సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయని కొనియాడారు. అందుకు అమరరాజా సంస్థ రంగారెడ్డి జిల్లా దివిటీపల్లిలో నిర్మించిన గిగా ఫ్యాక్టరీ కారిడార్​లో అధునాతన ఇంధన, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఎవాల్స్​ సదస్సులో అమరరాజా సావనీర్​ను మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు.

National Handloom Day 2023 : నేతన్నలపై వరాల జల్లు.. ఆరోగ్యకార్డుతో పాటు ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేలు

అగ్రికల్చరల్​ డేటా ఎక్స్ఛేంజ్ సెంటర్​ ప్రారంభం : మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ నొవాటెల్​లో అగ్రికల్చరల్​ డేటా ఎక్స్ఛేంజ్​ ప్లాట్​ఫారం, అగ్రికల్చరల్​ డేటా మేనేజ్​మెంట్​ ఫ్రేమ్​ వర్క్​ సేవలను కూడా మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలో తొలి అగ్రికల్చరల్​ డేటా ఎక్స్ఛేంజ్​ ఇది అని.. తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్​ ఎకానమిక్​ ఫోరం ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చిన సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్​ సూచించారు. రాష్ట్రంలో కీలక వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని.. గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు.

LB Nagar to Nagole metro : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఎల్బీనగర్ - నాగోల్ మెట్రో లింకు పనులు ప్రారంభం..

KTR Launch Agricultural Data Exchange Center : రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. ప్రతి గింజ కొంటున్నామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. మరే రాష్ట్రంలోనూ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేశారు. రైతుబంధు కింద ఏటా ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మిషన్​ కాకతీయ ద్వారా పెద్ద ఎత్తున చెరువులను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో పామాయిల్ సాగు 20 లక్షల ఎకరాల్లో విస్తరింపజేసేందుకు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తున్నామని ప్రకటించారు. హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, పింక్​ విప్లవం, ఎల్లో విప్లవం వంటి వాటిని తెలంగాణ చేరుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ అగ్రికల్చరల్​ డేటా ఎక్స్ఛేంజ్​ వల్ల క్రెడిట్​, వెదర్​, అడ్వైజరీ, క్రాప్​ మేనేజ్​మెంట్​ సేవలు త్వరితగతిన అందిస్తాయని చెప్పారు.

KTR To Inaugurate Nizamabad IT Hub : నిజామాబాద్​లో​ ఐటీ టవర్​ను ప్రారంభించిన కేటీఆర్.. నిరుద్యోగులకు హామీ​

KTR on Agriculture Sector : 'ప్రపంచంలో దేన్ని ఆపగలిగినా.. వ్యవసాయ రంగాన్ని మాత్రం ఆపలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.