ETV Bharat / state

Kishan Reddy Fires on Telangana Government : 'బీఆర్​ఎస్​ పార్టీ కేరాఫ్‌ అడ్రస్..​ సోనియాగాంధీ ఆఫీస్‌'

author img

By

Published : Aug 5, 2023, 7:49 PM IST

Updated : Aug 5, 2023, 8:07 PM IST

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy Fires on CM KCR : హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా కార్యశాల ముగింపు సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ మిగులు బడ్జెట్​గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాజ్యంగా మార్చారన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ కేరాఫ్‌ అడ్రస్‌ సోనియాగాంధీ ఆఫీస్‌ అని ఆరోపించారు. ఆగస్ట్ 15న ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

Kishan Reddy Latest Comments : బీఆర్​ఎస్​ పార్టీ కేరాఫ్‌ అడ్రస్

BJP State Chief Kishan Reddy Fires on CM KCR : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయం వేడెక్కుతుంది. కేసీఆర్ సర్కార్​ను గద్దె దించడానికి విపక్షాలు గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ నాయకులు. దక్షిణాదిలో బీజేపీ అగ్రనాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ముందు భారీ సభలు నిర్వహించి అగ్రనాయకులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Kishan Reddy Fires on CM KCR : తాజాగా బీజేపీ అదిష్ఠానం కేంద్రమంత్రి కిషన్​రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షత బాధ్యతను అప్పగించింది. కాగా కమలానాథులు రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న నిధులు.. వాటి వల్ల జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు చేరికలపై దృష్టి సారించిన బీజేపీ నాయకులు ప్రస్తుతం కలిసిగట్టుగా ఎన్నికల బరిలోకి దిగి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేసే యోచనలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా కార్యశాల ముగింపు సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కుటుంబ పరిపాలన జరుగుతుందన్నారు. బీఆర్​ఎస్ పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాజ్యంగా మార్చారు: రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తుందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ సర్కారు మిగులు రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందన్నారు. కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మరిందని మండిపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్..​ బీఆర్​ఎస్..​ ఎంఐఎం.. అన్నీ ఒక్కటే..: కేసీఆర్‌ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. ఇది నిజాం రాజ్యాంగం కాదు.. నేను నా కుటుంబం అంటే కుదరదన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ కేరాఫ్‌ అడ్రస్​ సోనియాగాంధీ ఆఫీస్‌ అని ఆరోపించారు. కుటుంబ పార్టీలకు పాతర వేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఆ పార్టీలు స్వార్థ రాజకీయాలు చేసి.. దేశాన్ని దోచుకుంటున్నాయరు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, ఎంఐఎం అన్నీ ఒకటే అని ఆరోపించారు. ఆగస్ట్ 15న ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి మట్టిని స్వీకరించి దిల్లీ కర్తవ్యపథ్‌లో నిర్మించే స్మారక స్థూపం కోసం పంపించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి బీజేపీలో చేరాలని కోరారు. కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు ఈ కుటుంబ పార్టీకి లేదని.. కేసీఆర్​ ఫ్యామిలీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 5, 2023, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.