ETV Bharat / state

పార్టీ కోసం ఏ పనైనా చేస్తా: కర్నె ప్రభాకర్​

author img

By

Published : Nov 14, 2020, 10:47 AM IST

ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు ప్రజలు, ప్రభుత్వం కోసం పని చేశానని మాజీ ఎమ్మెల్సీ, తెరాస నేత కర్నె ప్రభాకర్​ అన్నారు. భవిష్యత్తులో ఓ చిన్న అవకాశం వచ్చినా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. పార్టీ కోసం ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్​కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ కోసం ఏ పనైనా చేస్తా: కర్నె ప్రభాకర్​
పార్టీ కోసం ఏ పనైనా చేస్తా: కర్నె ప్రభాకర్​

భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని మాజీ ఎమ్మెల్సీ, తెరాస నేత కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. గోరెటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్​కు కర్నె ప్రభాకర్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.

ఆరేళ్ల పాటు శాసన మండలిలో చట్టాల రూపకల్పనలో భాగస్వామయ్యేందుకు కేసీఆర్, కేటీఆర్ అవకాశం కల్పించారని.. వారికి కర్నె ప్రభాకర్​ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు ప్రజలు, ప్రభుత్వం కోసం పని చేశానన్న కర్నె ప్రభాకర్.. భవిష్యత్తులో ఏ చిన్న అవకాశం వచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.

ఇదీ చదవండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.