ETV Bharat / state

బియ్యం పంచడానికి కాదు.. పాతికేళ్ల భవిష్యత్​ ఇవ్వటానికే జనసేన: పవన్​కల్యాణ్​

author img

By

Published : Jan 8, 2023, 11:01 AM IST

Pawan Kalyan : జనసేన పార్టీ ఏర్పాటుపై ఆ పార్టీ అధినేత పవన్​ కల్యాణ్ కీలక​ వ్యాఖ్యలు చేశారు. ఈనెల 12వ తేదీన ఏపీలోని శ్రీకాకుళంలో ఉన్న రణస్థలంలో యువశక్తి పేరుతో జనసేన సభను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan : ప్రజలకు పాతిక కేజిల బియ్యం పంపిణీ చేయడానికి తాము రాజకీయాల్లోకి రాలేదని.. పాతికేళ్ల భవిష్యత్‌ ఇవ్వడానికే జనసేన పార్టీ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. పేదలకు, యువతకు అండగా జనసేన ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రణస్థలంలో ఈనెల 12న నిర్వహించే జనసేన యువశక్తి సభకు యువత పెద్దఎత్తున తరలి రావాలని ఆయన ట్విట్టర్​లో ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 'మన యువత.. మన భవిత' అంటూ పోస్ట్ చేశారు. రణస్థలంలో జరిగే సభలో ‘వాయిస్ ఆఫ్ యూత్’ వినేందుకు ఎదురుచూస్తున్నానంటూ పవన్ ట్వీట్​లో తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.