ETV Bharat / state

Crime News: పని మనిషిలా చేరి బంగారం, వజ్రాభరణాలతో ఉడాయింపు.. ఒక్క ఫోన్​ కాల్​తో..!

author img

By

Published : Apr 21, 2023, 7:26 AM IST

Interstate Thieves Gang In Hyderabad: హైదరాబాద్‌లో ఉన్న సంపన్నుల ఇళ్లే వారి లక్ష్యం.. ఇంట్లో పని చేస్తామంటూ చేరి అందినకాడికి దోచుకొని పారిపోతారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నవీ ముంబై మహిళా నేరస్థుల ముఠా పోలీసులకు చిక్కింది. ఇటీవల అమీర్‌పేటలోని సీత సరోవర్‌ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడ్డ నిందితులు.. రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలతో ఉడాయించారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

woman thieves
woman thieves

ఇంట్లో పనిమనిషిలా చేరి.. బంగారం, వజ్రాలను దోచుకెళ్లిన మహిళ

Interstate Thieves Gang In Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేట సీత సరోవర్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నెంబర్‌ 202లో నివసించే వ్యాపారి రామ్‌నారాయణ్‌ ఇంట్లో.. ఈ నెల 3న చోరీ జరిగింది. బీరువాలో దాచిన రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలు మాయమయ్యాయి. వాటితో పాటు కొత్తగా పనిలోకి చేరిన సునీత అనే మహిళ కూడా కనిపించకపోవడంతో బాధితులు ఎస్సార్​నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చోరీకి పాల్పడిన మహిళతో సహా మరో మహిళను అరెస్ట్ చేశారు.

రూ.50 లక్షల విలువ చేసే బంగారం, వజ్రాలతో: నవీ ముంబయికి చెందిన ముఠాలోని నీతు, పూజ అనే మహిళలు బేగంపేట రైల్వే స్టేషన్‌లో దిగటంతోనే.. పని మనుషులు అవసరమున్న యజమానుల కోసం గాలించారు. ఈ క్రమంలో వ్యాపారి రామ్‌నారాయణ్‌ వద్ద పని చేసి మానేసిన డ్రైవర్‌ పూల్‌చంద్‌ వారికి తారసపడ్డాడు. అతని ద్వారా రామ్‌ నారాయణ్ ఇంట్లో సునీత, మరో ఇంట్లో పూజ పనిలో చేరారు. యజమానులు ఆధార్‌ కార్డులను ఇవ్వాలని అడగ్గా.. అవి లేకపోవడంతో పూజను పంపించేశారు. సునీతను మాత్రం కొనసాగించారు. ఈ క్రమంలో బాగా పని చేస్తున్నట్లు యజమానులను నమ్మించిన సునీత.. పనిలో చేరిన రెండు రోజుల్లోనే.. అదను చూసి చోరీకి పాల్పడింది. సుమారు రూ.50 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలతో ఉడాయించింది.

ఫోన్​ నంబర్​తో నిందితుల పట్టివేత: రామ్‌నారాయణ్‌ ఇంట్లో చోరీకి పాల్పడిన సునీత.. ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి ముంబయికి పారిపోయింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్‌ ఫోన్‌ తీసుకుని తనతో పాటు వచ్చిన పూజకు ఫోన్‌ చేసింది. పని పూర్తయ్యిందని, వచ్చేయమని చెప్పింది. చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా ఆమె ప్రయాణించిన ఆటోను గుర్తించారు. సునీతను నాంపల్లిలో దించిన ఆటో డ్రైవర్‌ను పట్టుకుని ప్రశ్నించారు. నిందితురాలు ఉపయోగించిన ఆటో డ్రైవర్‌ ఫోన్‌లో.. పూజ నెంబర్‌ను గుర్తించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు.

పూజ ఉపయోగించిన ఫోన్, సిమ్‌ కార్డులు కూడా చోరీ అయినవేనని విచారణలో వెల్లడైంది. అనంతరం.. వారి ఫోన్‌ నెంబర్లపై పోలీసులు నిఘా పెట్టారు. స్విచ్‌ఆఫ్‌లో ఉన్న ఫోన్లను మహిళలు ఆన్‌ చేయడంతో.. పోలీసులు వారిని ట్రేస్‌ చేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఓ శుభకార్యానికి వెళ్లిన ఇద్దరినీ.. అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బెంగళూరులో.. గతంలో ఇదే తరహా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.