ETV Bharat / state

ts Icet Counseling 2021: నవంబర్​ 3 నుంచి ఐసెట్​ కౌన్సెలింగ్​ ప్రారంభం

author img

By

Published : Oct 27, 2021, 9:26 PM IST

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నవంబరు 3 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది (ts Icet Counseling 2021). మొదటి, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది.

i cet counselling
i cet counselling

నవంబర్​ 3 నుంచి ఐసెట్​ కౌన్సెలింగ్​ ప్రారంభం కానుంది (ts Icet Counseling 2021). ఐసెట్​ మొదటి, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం నవంబరు 3 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్ ఉంటుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. నవంబరు 6 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. నవంబరు 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. నవంబరు 14న ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. నవంబరు 14 నుంచి 18 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

నవంబరు 21న ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్​తో ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది (ts Icet Counseling 2021). నవంబరు 22న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన, 22, 23న తుది విడత వెబ్​ఆప్షన్ల నమోదు చేపట్టి... 26న తుది విడత సీట్లను కేటాయించనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కోసం నవంబరు 28న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఐసెట్​ కౌన్సెలింగ్​ షెడ్యూలు
ఐసెట్​ కౌన్సెలింగ్​ షెడ్యూలు

ఇదీ చూడండి: ICET results 2021: ఐసెట్‌ ఫలితాలు విడుదల.. 90.09 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.