ETV Bharat / state

ఐబీఎస్‌లో ర్యాగింగ్.. కేటీఆర్​కు ట్వీట్​... 12 మంది విద్యార్థులు సస్పెండ్

author img

By

Published : Nov 12, 2022, 10:24 AM IST

Updated : Nov 12, 2022, 11:45 AM IST

Raging in Indian Business School: హైదరాబాద్‌ నగరంలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలోని ఐబీఎస్​ కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోంది. బాధితులు కేటీఆర్​కు ట్వీట్​ చేయగా... ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

Raging
Raging

Raging in Indian Business School: హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్‌ బిజినెస్‌ ఐఎస్​బీలో ర్యాగింగ్ ఘటనపై... యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 12మంది విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన అధికారులు.. యాంటీ ర్యాగింగ్‌ స్క్వాడ్‌ దర్యాప్తు తర్వాత మరికొందరిపై వేటువేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 1న ఐఎస్​బీలో చదువుతున్న ఓ జూనియర్‌ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు.

ఆ తర్వాత ఆ దృశ్యాలను కాల్‌జ్‌ గ్రూప్స్‌లో అప్‌లోడ్‌ చేశారు. ర్యాగింగ్‌ బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదుచేయగా రాజీకుదర్చి పంపిచారు. ఆనంతరం ఆ విషయాన్ని బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయగా శంకర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచనల ఆధారంగా 12 మంది విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ దర్యాప్తు అనంతరం మరికొంత మందిపై వేటు పడే అవకాశం ఉంది తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 12, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.