ETV Bharat / state

మన పోలీసుకు ప్రపంచ ఖ్యాతి.. ఆ పదినగరాల్లో హైదరాబాద్!

author img

By

Published : Jan 5, 2021, 6:46 AM IST

ప్రపంచంలోనే అత్యధికంగా సీసీ కెమెరాలు వినియోగిస్తున్న మొదటి పది నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం లభించింది. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సేవలు అందించే ‘సర్ఫ్‌షార్క్‌’అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా సీసీ కెమెరాల వినియోగానికి సంబంధించి నివేదిక రూపొందించింది.

హైదరాబాద్​ నలుచెరగులా మూడోకన్ను!
హైదరాబాద్​ నలుచెరగులా మూడోకన్ను!

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్న తెలంగాణ పోలీసుశాఖ మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యధికంగా సీసీ కెమెరాలు వినియోగిస్తున్న మొదటి పది నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం లభించింది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లోని నగరాలను తలదన్ని ముందు వరుసలో నిలబడింది.

సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సేవలు అందించే ‘Surfshark‌’అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా సీసీ కెమెరాల వినియోగానికి సంబంధించి నివేదిక రూపొందించింది. దీని ప్రకారం సీసీ కెమెరాల సాంద్రత అంటే చదరపు కిలోమీటర్‌కు ఉన్న కెమెరాల సంఖ్య ప్రకారం హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. మొదటిస్థానంలో నిలిచిన చెన్నై కూడా దక్షిణ భారత నగరమే కావడం గమనార్హం.

జనాభా నిష్పత్తి ప్రకారం అంటే ప్రతి వెయ్యి మంది జనాభాకు ఏర్పాటయిన కెమెరాల ప్రకారం చూస్తే హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. ఈ రెండు అంశాల్లోనూ మన దేశానికి చెందిన మూడు నగరాలు మొదటి పది స్థానాల్లో ఉండటం గమనార్హం.

నలుచెరగులా మూడోకన్ను!
నలుచెరగులా మూడోకన్ను!

సంవత్సరాంతానికి రెట్టింపు..

ప్రస్తుతం రాష్ట్రంలో 6.65 లక్షల సీసీ కెమెరాలు ఉండగా అందులో ఆరు లక్షల వరకూ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ సంవత్సరాంతానికి రాష్ట్రంలో సీసీ కెమెరాల సంఖ్య 13 లక్షలకు, హైదరాబాద్‌లో 10 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇది సాకారమైతే సీసీ కెమెరాలు అత్యధికంగా వినియోగిస్తున్న ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌ స్థానం మరింత మెరుగవుతుంది.

సీసీ కెమెరాల వినియోగం పెరగడం వల్ల కేసుల దర్యాప్తు సులభమవుతోంది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4,490 కేసులను సీసీ కెమెరాల్లో నమోదయిన దృశ్యాల వల్ల ఛేదించగలిగారు.

నలుచెరగులా మూడోకన్ను!
నలుచెరగులా మూడోకన్ను!

ఇవీ చూడండి: ఏ విదేశీ సంస్థకూ తీసిపోం.. యూకే స్ట్రెయిన్‌పైనా పనిచేస్తుంది: కృష్ణ ఎల్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.