ETV Bharat / state

'మంత్రి కేటీఆర్​ పుట్టిన రోజున ఆ కానుక ఇవ్వండి'

author img

By

Published : Jul 21, 2020, 6:36 PM IST

ఈనెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక మంత్రి కేటీఆర్​ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు చిరునవ్వులు కానుకగా ఇవ్వాలని జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి సాయమందించి వారి చిరునవ్వులను మంత్రి కేటీఆర్​కు కానుక ఇవ్వాలని కోరారు.

gift a smile to ktr on his birthday by helping needy
జులై 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బర్త్ డే

ఈనెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా చిరునవ్వులు కానుకగా ఇవ్వాలని జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసి వారి చిరునవ్వులను కేటీఆర్​కు కానుకగా ఇవ్వాలని కోరారు.

బొకేలు, శాలువాలు, హోర్డింగ్​ల కోసం ఖర్చు చేయకుండా వస్తు, ధన రూపాల్లో వ్యక్తిగత, సామాజిక అవసరాలు తీర్చాలని సూచించారు. వాటి ఫొటోలు, వివరాలను కేటీఆర్​ ట్విటర్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​ వంటి సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్​ చేయాలని చెప్పారు.

మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెరాస శ్రేణులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. కరోనా పరిస్థితుల కారణంగా నిరాడంబరంగా జరపాలని నిర్ణయించినట్లు బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.