ETV Bharat / state

తెలంగాణకు అందే నిధులపై నేడు స్పష్టత

author img

By

Published : Feb 1, 2021, 5:42 AM IST

Updated : Feb 1, 2021, 6:31 AM IST

కేంద్రం నుంచి ఐదేళ్లపాటు తెలంగాణకు అందే నిధులపై నేడు స్పష్టత రానుంది. ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు సహా వివిధ అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 15వ ఆర్థిక సంఘానికి నివేదించింది. సోమవారం పార్లమెంట్‌లో ఆర్థిక సంఘం నివేదికను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

how much allocation to Telangana in central budjet?
తెలంగాణకు అందే నిధులపై నేడు స్పష్టత

తెలంగాణకు అందే నిధులపై నేడు స్పష్టత

తెలంగాణకు కేంద్రం నుంచి ఐదేళ్లపాటు అందే నిధులపై నేడు స్పష్టత రానుంది. ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు సహా వివిధ అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 15వ ఆర్థిక సంఘానికి నివేదించింది. సోమవారం పార్లమెంట్‌లో ఆర్థిక సంఘం నివేదికను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వివిధ రంగాల అభ్యున్నతి కోసం రాష్ట్రానికి రూ. 92,800 కోట్లను కేటాయించేలా సిఫారసు చేయాలని ఇప్పటికే తెలంగాణ కోరింది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ నిర్వహణకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని నివేదించింది.

పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలి

కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని కోరింది. సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులను ఇచ్చి అమలు బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలకు ఇవ్వాలని సూచించింది. గత ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్‌ సందర్భంగా 2020-21 ఆర్థిక సంవత్సరం కోసం 15వ ఆర్థిక సంఘం ఏడాదికి ఇచ్చిన మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టారు. అంతక్రితం 14వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే పన్నులవాటా 42 శాతంగా సిఫారసు చేయగా 15వ ఆర్థిక సంఘం మధ్యతర నివేదికలో అది 41 శాతానికి తగ్గింది. ఈ క్రమంలో తెలంగాణకు అందే పన్నుల వాటా 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది. అలాగే రాష్ట్రానికి రూ. 723 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను ఆర్థిక సంఘం సిఫారసు చేసినా కేంద్రం ఇవ్వలేదు. సోమవారం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి నివేదికతో కేంద్రం నుంచి అందే నిధుల లభ్యత పెరగవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలు
* కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాల పన్ను వాటాను 50 శాతానికి పెంచాలి
* మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు ప్రత్యేక తోడ్పాటు ఇవ్వాలి
* ప్రజాకర్షకపథకాల పేరుతో ప్రోత్సాహకర నిధులను నిరాకరించడం సరికాదు
* రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నాలుగు శాతం రుణం తీసుకునేలా ఉండాలి
* సాగునీటి ప్రాజెక్టుల ఎత్తిపోతల నిర్వహణకు రూ. 40,169 కోట్లు ఇవ్వాలి
* ఐదేళ్లపాటు మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నిర్వహణకు 12,722 కోట్లు
* విద్యారంగానికి రూ. 7,584 కోట్లు, విద్యుత్‌ రంగానికి రూ. 4,442 కోట్లు
* స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 8,816 కోట్లు
* శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుశాఖలో సంస్కరణలు రూ. 7,610 కోట్లు
* సంక్షేమ రంగానికి రూ.5,763 కోట్లు, వైద్య ఆరోగ్యం రూ. 1,085 కోట్లు
* ఆర్‌ అండ్‌ బికి రూ.2,669 కోట్లు, అడవుల పరిరక్షణకు రూ.1,208 కోట్లు
* విపత్తుల నిర్వహణకు రూ.381 కోట్లు, యువజన సేవలకు రూ. 357 కోట్లు

ఇదీ చదవండి: విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం

Last Updated :Feb 1, 2021, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.