ETV Bharat / state

ఎండీ మనోహర్​ సస్పెన్షన్​ వేటుపై నిర్ణయం తీసుకోవాలి - లేదంటే చర్యలు తప్పవు : హైకోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 10:25 AM IST

Updated : Dec 30, 2023, 1:29 PM IST

High Court on Tourism MD Manohar Rao Suspension : ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు సస్పెండ్​​ చేసిన పర్యాటక శాఖ కార్పొరేషన్​ ఎండీ మనోహర్​ రావుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనందుకు హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. లేదంటే కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.

Tourism MD Manohar Rao Suspend Reason
MD Manohar Rao Suspension Latest News

High Court on Tourism MD Manohar Rao Suspension : పర్యాటక శాఖ కార్పొరేషన్​ ఎండీ మనోహర్​ రావుపై(Tourism Corporation MD Manohar Rao) ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్​కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణలోగా ఈ అంశంలో నిర్ణయం తీసుకోకపోతే బాధ్యులైన పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

MD Manohar Rao Suspension Latest News : అక్టోబర్​ 15, 16 తేదీల్లో మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి ఎండీ మనోహర్​ రావు, ఓఎస్డీగా పనిచేస్తున్న విశ్రాంత అధికారి సత్యనారాయణ తిరుమల వెళ్లారు. ఈ విషయంలో వారిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం మనోహర్ రావుపై సస్పెన్షన్​ వేస్తూ, శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని నవంబర్​ 17 ఆదేశించింది. ఈ విధంగా ఎన్నికల సమయంలో పలు అధికారులను సస్పెండ్​ చేసింది. అందులో మాజీ డీజీపీ అంజనీ కుమార్ కూడా​ ఒకరు.

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ - పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీపై సస్పెన్షన్‌ వేటు

High Court Hearing on MD Manohar Rao Suspension : హైకోర్టులో నవంబరు 17న ఎన్నికల సంఘం(Election Commission Suspend MD Manohar Rao) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎండీ మనోహర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే రెండు సార్లు విచారణ చేపట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్​లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. అనంతరం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేనందున అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలు పూర్తయ్యాయని, అందువల్ల మోహనరావు సస్పెన్షన్ ఎత్తి వేయలేదంటే శాఖాపరమైన విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఏ విషయం తేల్చకుండా ఎన్నేళ్లయినా సస్పెన్షన్​ను కొనసాగించడానికి వీల్లేదని తెలిపింది.

దిశ కేసులో పోలీసుల వాదనలు వినడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Tourism MD Manohar Rao Suspend Reason : మాజీ డీజీపీ అంజనీ కుమార్​పై సస్పెన్షన్​ను ప్రభుత్వం ఎత్తివేసినపుడు దీనిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో నిర్ణయం తీసుకోవాలని రెండు వాయిదాలు వేసినా స్పందించలేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణలోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే బాధ్యులైన పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు తాము కేసు పూర్వాపరాలపై విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ రెండు వారాలకు వాయిదా - పూర్తి వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు

మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఎన్నిక వివాదం - పిటిషన్​ను కొట్టివేసిన హైకోర్టు

Last Updated :Dec 30, 2023, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.