ETV Bharat / state

Highcourt on Engg seats: ఇంజినీరింగ్​లో కొత్త కోర్సులకు అనుమతివ్వండి: హైకోర్టు

author img

By

Published : Oct 8, 2021, 4:57 AM IST

Updated : Oct 8, 2021, 6:31 AM IST

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులకు అనుమతివ్వాలని జేఎన్టీయూ హైదరాబాద్​ను హైకోర్టు ఆదేశించింది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించి కొత్త వాటికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 11 ఇంజినీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో తుది విడత కౌన్సెలింగ్ నాటికి కొత్త కోర్సుల్లో మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Highcourt on Engg seats
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొత్తకోర్సులకు గుర్తింపునివ్వాలని జేఎన్‌టీయూహెచ్​కు హైకోర్టు ఆదేశం

ప్రభుత్వం అనుమతితో సంబంధం లేకుండా ఇంజినీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులకు అనుమతివ్వాలని జేఎన్టీయూహెచ్ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఎన్​వోసీ తీసుకోవాలన్న జేఎన్టీయూహెచ్​కు ఈ మేరకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న ఐటీ కోర్సులను ప్రవేశ పెట్టేందుకు పలు కాలేజీలకు అనుమతినిచ్చింది. అయితే కాలేజీలో మొత్తం సీట్ల సంఖ్య పెరగవద్దని స్పష్టం చేసింది. దీంతో పలు కాలేజీలు సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ వంటి ఏఐసీటీఈ కోర్సుల్లో సీట్లను వెనక్కి ఇచ్చి.. సీఎస్​ఈ, ఆర్టిఫియల్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులకు అనుమతివ్వాలని జేఎన్టీయూహెచ్​ను కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటేనే గుర్తింపునిస్తామని నిబంధన పెట్టిన యూనివర్సిటీ.. పలు కాలేజీల వినతిని తోసిపుచ్చింది. ఏఐసీటీఈ ఆమోదించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలన్న జేఎన్ టీయూహెచ్ నిబంధనను సవాల్ చేస్తూ 11 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి.

ఇంజినీరింగ్​లో కొత్త కోర్సులు


ఇంజినీరింగ్ కోర్సుల అనుమతి, సీట్ల పెంపులో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండదని.. ఏఐసీటీఈ, యూనివర్సిటీ మాత్రమే నిర్ణయించాలని కళాశాలల తరఫు న్యాయవాది వాదించారు. సంప్రదాయ కోర్సుల్లో సీట్లను జేఎన్టీయూహెచ్ తగ్గించినప్పటికీ.. కొత్త కోర్సులకు అనుమతివ్వలేదని పేర్కొంది. రాష్ట్రంలో విద్యావసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జేఎన్టీయూహెచ్ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వ అనుమతి ఉండాలన్న జేఎన్ టీయూహెచ్ నిబంధనను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంతో తుది విడత కౌన్సెలింగ్ నాటికి కొత్త కోర్సుల్లో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈనెలాఖరున తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది.

ఇదీ చూడండి: Engineering Counselling: ఇంజినీరింగ్ కొత్త విధానమేంటి? కౌన్సెలింగ్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

Last Updated : Oct 8, 2021, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.