ETV Bharat / state

భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్​

author img

By

Published : Sep 8, 2022, 2:43 PM IST

Updated : Sep 8, 2022, 5:39 PM IST

భారీగా వర్షం
భారీగా వర్షం

Hyderabad Rains Today: హైదరాబాద్‌లో మూడు రోజుల నుంచి జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ రోజు పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిమద్దయ్యారు. రహాదారుల పైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

Hyderabad Rains Today: హైదరాబాద్​లో భారీగా వర్షం పడుతుంది. వానహోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. అసెంబ్లీ, బషీర్‌బాగ్, కోఠి, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, అబిడ్స్‌ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అలాగే నాంపల్లి, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, ఖైరతాబాద్‌ కూకట్​పల్లి, హైదర్​నగర్, ఎర్రగడ్డ, సనత్​నగర్, ​ఎస్ఆర్‌నగర్‌, ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.

యూసుఫ్‌గూడ, మైత్రివనం, అమీర్‌పేట., రామంతాపూర్‌, సైదాబాద్, కంటోన్మెంట్, నేరేడ్​మెట్ , హబ్సిగూడ, ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.​ రహాదారుల పైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.

భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్​

రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాల కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం ఈ రోజు బలహీనపడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఆవర్తన ప్రభావంతో.. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని సంచాలకులు వెల్లడించారు.

ఈ అల్పపీడనం సగటు సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇది రానున్న 48గంటల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం మీదుగా మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, భోపాల్, గోండియా, జగదల్‌పూర్, కళింగపట్నం మీదుగా.. తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతానికి వెలుతుందని వాతావరణ కేంద్ర సంచాలకులు వివరించారు.

అసలే వర్షాకాలం.. ఇక ఈ నాలాల నీటి వల్ల దోమలు ఎక్కువవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే వైరల్, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొంగుతున్న నాలాల వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపి తమను రోగాల బారిన పడకుండా కాపాడాలని వేడుకుంటున్నారు.

Last Updated :Sep 8, 2022, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.