ETV Bharat / state

హైదరాబాద్‌ శివార్లలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి

author img

By

Published : May 31, 2022, 5:52 PM IST

heavy Rain fall in Hyderabad: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఇప్పటికే రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

heavy Rain fall in Hyderabad
హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం!!

heavy Rain fall in Hyderabad: భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణ వాసులకు కాస్త ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ.. భారీ వర్షం ముంచెత్తుతోంది. రంగారెడ్డి, మేడ్చల్‌, జిల్లాల్లో, నగర శివారు ప్రాంతం హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నంలో వాన దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఈ వర్షంతో ఉపశమనం లభించింది. తెలంగాణలో రాగల రెండు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవాకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.