ETV Bharat / state

green channel: కాసేపట్లో నిమ్స్​లో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్

author img

By

Published : Sep 15, 2021, 11:19 AM IST

Updated : Sep 15, 2021, 11:37 AM IST

హైదరాబాద్​ పంజాగుట్ట నిమ్స్​లో వైద్యులు గుండె మార్పిడి చికిత్స చేయనున్నారు. ప్రమాదంలో గాయపడి.. బ్రెయిన్​డెడ్​ అయిన వ్యక్తి హృదయాన్ని మలక్​పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్​ ఛానెల్​ ద్వారా తరలించనున్నారు.

green channel
green channel

హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్​ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్​ చానల్​ద్వారా మలక్​పేట్​ యశోద ఆస్పత్రి నుంచి పంజాగుట్ట నిమ్స్​ ఆస్పత్రికి గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో గాయపడి.. బ్రెయిన్​డెడ్​ అయిన వ్యక్తి హృదయాన్ని నిమ్స్​లో రోగికి మార్పిడి చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు యశోదా నుంచి గుండె తీసుకుని అంబులెన్స్​బయలుదేరనుంది.

కానిస్టేబుల్​ వీరబాబు
మృతుడు వీరబాబు

కొండాపూర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఖమ్మానికి చెందిన వీరబాబు కానిస్టేబుల్ (34)​ ఈనెల 12న విధులకు వెళ్తుండగా గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం బ్రెయిన్​డెడ్​ అయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి హృదయాన్ని దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో.. పంజాగుట్టల నిమ్స్​లో రోగికి గుండెను మార్పిడి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రీన్​ ఛానల్​ ద్వారా హృదయాన్ని తరలించనున్నారు. నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించగా.. మొట్ట మొదటి సారి బయటి ఆస్పత్రి నుంచి నిమ్స్​కు గుండెను తరలిస్తున్నారు.

ఒక్కరోజులోనే హృదయం లభించింది

కానిస్టేబుల్​ వీరబాబు నుంచి సేకరించిన గుండెను... గుండె మార్పిడి అవసరమైన 30 ఏళ్లలోపు పెయింటర్​కు అమర్చనున్నారు. నిమ్స్​లో చికిత్స పొందుతున్న పెయింటర్​ గుండె కోసం మంగళవారం జీవన్​దాన్​లో నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న ఒక్క రోజులోనే హృదయం లభించడం అరుదు.

ఇదీ చూడండి: ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్.. మెట్రోలో గుండె తరలింపు

Last Updated :Sep 15, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.