ETV Bharat / state

Health Benefits Of Eggs in Telugu : కోడిగుడ్డు.. అందానికీ, ఆరోగ్యానికీ వెరీ గుడ్డు!

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 2:31 PM IST

Eggs Benefit For Weight Loss
Health Benefits Of Eating Eggs

Health Benefits Of Eggs in Telugu : శరీరానికి పోషకాలన్నీ అందాలి.. బరువు మాత్రం పెరగొద్దు.. ఇదేగా మనం కోరుకునేది. అయితే గుడ్డును ఎంచుకోమంటున్నారు నిపుణులు. పవర్‌ప్యాక్డ్‌ ఫుడ్‌గా చెప్పే ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందంటున్నారు. అందుకే రోజువారీ డైట్‌లో గుడ్డును చేర్చుకోండి అంటున్నారు నిపుణులు.

Health Benefits Of Eating Eggs : బరువు అదుపులో ఉండాలి.. ఆరోగ్యాన్నీ, అందాన్నీ ఇవ్వాలి. వీటిన్నంటిని అందించే ఒక సూపర్‌ ఫుడ్‌ ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే రోజువారీ డైట్‌లో గుడ్డును చేర్చుకోండి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..?

ఉదయాన్నే లేచాక నీరసంగా శరీరంలోనుంచి శక్తినంతా తీసేసినట్లుగా అనిపిస్తోందా? ముందు రోజు పని చాలా ఎక్కువయ్యో, నిద్ర సరిగా లేకపోవడం వల్ల అనుకుంటాం కానీ, శరీరంలో ఒక్కోసారి విటమిన్‌ డి, బి12 తగినంత మోతాదులో అందకపోయినా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. గుడ్డును రోజూ తీసుకోవడం వల్ల ఇది ఈ విటమిన్లను సమృద్ధిగా అందిస్తుంది.

గుడ్డుతో బోలెడు లాభాలు.. రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది?

  • గుడ్డులో బి2, బి5, బి12, అమైనో యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం, కురులు, గోళ్ల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు చర్మానికి తేమను అందిస్తాయి.
  • పనుల హడావుడిలో పడి ఒక్కోసారి ముఖ్యమైన విషయాలనూ మర్చిపోతుంటాం. గుడ్డును తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని కోలీన్‌ అనే మైక్రో న్యూట్రియంట్‌ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అంతే కాదు మనలోని భావోద్వేగాలనూ అదుపులో ఉంచుతుంది.
  • అమ్మయ్యాక సహజంగానే ఎముకల్లో బలం తగ్గుతుంది. గుడ్డు తినడం వల్ల ఇందులోని విటమిన్‌ డి.. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఐరన్‌, ఫోలేట్‌ రక్తహీనతను దరిచేరనీయవు.
  • పిల్లలు సరిగా తినరు.. అన్నింటికీ వంకలు పెడతారు పిల్లలపై తల్లులకు ఉండే ఫిర్యాదే ఇది. గుడ్డులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, 13 రకాల విటమిన్లతోపాటు మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తినిపిస్తే వారి శరీరానికి కావాల్సిన పోషకాలను భర్తీ చేసినవారు అవుతారు.
  • చిన్నారుల కాలక్షేపం ఇప్పుడు మొబైళ్లే! ఆ ప్రభావం వారి కళ్లపై పడుతుంది. గుడ్డు పచ్చసొనలోని లూటిన్‌ కళ్ల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సాయపడుతుంది.
  • చర్మం ఆరోగ్యంగా, నిగ నిగలాడుతూ కనిపించడంలో సెలీనియంది ప్రధాన పాత్ర. ఇది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజూ తీసుకుంటే చర్మాన్ని సంరక్షించి, ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. దీనిలోని లూటిన్‌, జెనాక్సాంథిన్‌... కణాలు పాడవకుండా కాపాడి, వృద్ధాప్య ఛాయల్ని దరిచేరన్వివు.
  • అధికంగా ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల.. ఆహారంలోని థర్మిక్​ ప్రభావాన్ని(Thermic Effect of Food) పెంచవచ్చు. ఇది మన శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఒక బృహత్తర ప్రక్రియ. ఆహారంలోని పోషకాలను జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ కేలరీలను వినియోగించవలసి ఉంటుంది. కనుక శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఈ విధంగా శరీర బరువు తగ్గుతుంది.

Eggs For Weight Loss : వేగంగా బరువు తగ్గాలా?.. కోడి గుడ్లను ఇలా తిని చూడండి!

Poultry Farming: గుడ్డుకు రూ.500.. కోడి పిల్లకు రూ.1000

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.