ETV Bharat / state

Grand Nursery Mela 2023 : హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన గ్రాండ్ నర్సరీ మేళా

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 8:04 PM IST

Updated : Aug 31, 2023, 9:01 PM IST

Grand Nursery Mela 2023 in Hyderabad : హైదరాబాద్ వేదికగా గ్రాండ్ నర్సరీ మేళా-2023 ప్రారంభమైంది. పలు కంపెనీలు, అంకుర కేంద్రాలు, నర్సరీలు.. 150 వరకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. అరుదైన మొక్కలు, విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ మేళాలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

14th Grand Nursery Mela in Hyderabad
Grand Nursery Mela 2023

Grand Nursery Mela 2023 in Hyderabad : హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో గ్రాండ్ నర్సరీ మేళా-2023 (Grand Nursery Mela 2023 in Hyderabad) కన్నుల పండువగా ప్రారంభమైంది. ఈ అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శనను.. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత్‌ కె జెండగే లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఛైర్మన్ కె.రాములు, తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఛైర్మన్ మహ్మద్ ఖలీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే పలు స్టాళ్లను ప్రత్యేక కమిషనర్ హనుమంత్‌ కె జెండగే కలియ తిరిగి పరిశీలించారు. ఈరోజు నుంచి సెప్టెంబరు 5 వరకు 6 రోజుల పాటు జరగనున్న ఉద్యాన ప్రదర్శనలో 150 పైగా స్టాళ్లు కొలువు తీరాయి. వ్యవసాయ, ఉద్యాన రంగంలో వస్తున్న సరికొత్త పోకడల నేపథ్యంలో అన్నదాతలు.. ప్రత్యేకించి జంట నగరవాసుల టెర్రస్ గార్డెనింగ్ కోసం అవసరమైన విత్తనాలు, వివిధ రకాలు, జాతుల పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు, కుండీలు, వర్మీ కంపోస్ట్, ఇతర పనిముట్ల ప్రదర్శన, విక్రయం సాగుతోంది.

Grand Nursery Mela in Hyderabad: ఉత్సాహంగా సాగుతున్న "జాతీయ ఉద్యాన ప్రదర్శన"

Grand Nursery Mela in Peoples Plaza : కరోనా నేపథ్యంలో సుగంధ, ఔషధ మొక్కల ప్రాధాన్యత తెలుసుకున్న క్రమంలో.. ఆయా జాతులు, రకాలు అందుబాటులోకి తీసుకొచ్చి స్టాళ్లను ఏర్పాటు చేశారు. కొత్తగా మనీప్లాంట్ ఐదారు రకాలతో అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా బెంగళూరు గులాబీ, డచ్ గులాబీ, హాలండ్ గులాబీ, ఎడీనియం, జామియా సైకస్, బేబీ డాల్, అంతేరియం, అండ్రేంజా ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్స్‌ ప్రదర్శన, విక్రయాలు సాగుతున్నాయి. హాంగింగ్ మోతీ - ముత్యం రకం తీగ జాతి మొక్క కూడా సందర్శకులను ఆకర్షించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ ప్రతి నీటి చుక్క వినియోగించుకోడానికి హైడ్రోపొనిక్ టెక్నాలజీ, సూక్ష్మ సేద్యం టెక్నాలజీ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు.

మొదటి రోజు కూడా సందర్శకుల సందడి మొదలైంది. హైదరాబాద్‌ నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు, ఔత్సాహిక నగర సేద్యందారులు తరలి వస్తున్నారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన నర్సరీల్లో తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారని ప్రత్యేక కమిషనర్ హనుమంత్‌ కె జెండగే అన్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ మంచి చొరవ తీసుకుని జాతీయ స్థాయి మేళా ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరం గ్రీన్‌ సిటీగా మారుతున్న క్రమంలో.. ఇంటి యజమాని తమ ఖాళీస్థలం లేదా డాబాలు, బహుళ అంతస్తుల భవనాలపై మొక్కలు పెంచుకోవాలని ఆయన సూచించారు.

Grand Nursery Fair: నేటి నుంచి ఐదురోజుల పాటు గ్రాండ్‌ నర్సరీ మేళా..

ఏటా జాతీయ నర్సరీ మేళా 5 రోజులపాటు జరగనుంది. కానీ, ఈ సారి జంట నగరవాసుల విజ్ఞప్తి మేరకు మరొక రోజు పెంచి ఆరు రోజులపాటు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ మేళాకు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, టెర్రస్‌ గార్డెన్‌ నిర్వహకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.

Grand Nursery Mela 2023 హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన గ్రాండ్ నర్సరీ మేళా

భాగ్యనగరం వేదికగా.. నేటి నుంచి గ్రాండ్ నర్సరీ మేళా

హైదరాబాద్ వేదికగా నేటి నుంచి గ్రాండ్ నర్సరీ మేళా 2022

Last Updated :Aug 31, 2023, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.