ETV Bharat / state

Ganesh Idol Installation Permission Online in Telangana 2023 : గణేష్​ మండపం పర్మిషన్​ కోసం ఆన్​లైన్​లో అప్లై చేయడం ఎలానో తెలుసా..?

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 4:18 PM IST

Ganesh Idol Installation Permission Online in Telangana 2023 : వినాయక చవితి వచ్చేస్తోంది. బొజ్జ గణపయ్యల కోసం ప్రతీ బజారులో మండపాలు ముస్తాబవుతున్నాయి. అయితే.. మండపాల ఏర్పాటుప కోసం పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారా? ఆన్​లైన్​లోనే ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీకు తెలుసా..?

How to Apply Ganesh Idol Installation in Online
Ganesh Idol Installation Permission Online in Telangana 2023

Ganesh Idol Installation Permission Online in Telangana 2023 : వినాయక చవితి ఉత్సవాల ఆరంభానికి వారం కూడా లేదు. దీంతో.. ఉత్సవ కమిటీలు ఇప్పటికే పనుల్లో మునిగిపోయాయి. వీధి వీధినా.. బొజ్జ గణపయ్య విగ్రహాల ప్రతిష్ఠ కోసం.. అందమైన మండపాలు సిద్ధమవుతున్నాయి. అయితే.. వినాయకుడి మండపాలు ఏర్పాటు చేయాలంటే.. పోలీసుల అనుమతి తప్పని సరి. ఇందుకోసం.. ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలని హైదరాబాద్​ సిటీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అది కూడా.. ఈ నెల 14 లోపే దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు. మరి ఆన్​లైన్​లో గణేష్​ మండపాల ఏర్పాటుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Vinayaka Chavithi 2023 Sep 18th or 19th?: వినాయక చవితి ఎప్పుడు..? 18నా..? 19వ తేదీనా..?

Application Process of Ganesh Mandapalu:

  • ముందుగా..https://policeportal.tspolice.gov.in/index1.htm ఈ వెబ్​సైట్​ను ఓపెన్​ చేయండి.
  • స్క్రీన్​ మీద అప్లికేషన్​ ఫారమ్​ ఓపెన్​ అవుతుంది.
  • అప్లికేషన్​ ఫారమ్​లో Applicant details కాలమ్​.. Installation Details కాలమ్​ ఉంటుంది.
  • ముందుగా.. Applicant Details కాలమ్​లో.. అప్లికెంట్​ పేరు, అడ్రస్​, ఫోన్​ నెంబర్​, మెయిల్​ ఐడీ, అసోసియేషన్​ పేరు ఎంటర్​ చేయాలి.
  • Installation Details కాలమ్​లో.. గణేష్​ మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, కాలనీ, గ్రామం, మండలం, జిల్లా, పిన్​కోడ్​, Idol Type(POP or Clay), పోలీస్​స్టేషన్​ పరిధి, విగ్రహం ఎత్తు(ఒకవేళ మీరు మండపాన్ని గుడి, అపార్ట్​మెంట్​, ప్రైవేట్​ బిల్డింగ్​లో ఏర్పాటు చేస్తే.. వాటి ఎత్తు) వివరాలు ఎంటర్​ చేయాలి.
  • పేజ్​ను కిందకు స్క్రోల్​ చేసిన తర్వాత.. మీ కమిటీ మెంబర్​ వివరాలను ఎంటర్​ చేయాలి. కనీసం ఐదుగురి సభ్యుల వివరాలు నమోదు చేయాలి. అందులో.. పేరు, వయసు, చిరునామా, వృత్తి, ఫోన్​ నెంబర్​ ఎంటర్​ చేయాలి.
  • ఆ తర్వాత నిమజ్జనం వివరాలు నమోదు చేయాలి. నిమజ్జనం చేసే తేదీ, సమయం, ప్రదేశం వివరాలను ఎంటర్​ చేయాలి.
  • విగ్రహం నిమజ్జనం కోసం ఉపయోగించే వావానాన్ని కూడా ఎంచుకోవాలి.
  • అందులో వెహికిల్​ రిజిస్ట్రేషన్​ నెంబర్​, వెహికిల్​ ఓనర్​ పేరు, అతడి చిరునామా, ఫోన్​ నెంబర్​, అలాగే వెహికల్​ డ్రైవర్​ పేరు, చిరునామా, ఫోన్​ నెంబర్​, వెహికల్​ క్లీనర్​ పేరు, చిరునామా, ఫోన్​ నెంబర్​ ఎంటర్​ చేయాలి.
  • ఆ తర్వాత బండి ఓనర్​ దగ్గర నుంచి లెటర్​ తీసుకోని దానిని అప్​లోడ్​ చేయాలి.(Only PDF), అలాగే వెహికిల్​ ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ కూడా అప్​లోడ్​ చేయాలి.
  • అలాగే నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనే వాలంటీర్​ వివరాలు కూడా ఎంటర్​ చేయాలి. అందులో వాలంటీర్​ పేరు, వయసు, చిరునామా, ఫోన్​ నెంబర్​ వివరాలు నమోదు​ చేయాలి.
  • నిమజ్జనం కోసం విగ్రహంతో పాటు వచ్చే వారి పేర్లు ఎంటర్​ చేయాలి. అందులో పేరు, వయసు, చిరునామా, వృత్తి, ఫోన్​ నెంబర్​ ఎంటర్​ చేయాలి.

సమ్మతి అండ్​ అనుమతులు: (Consents and Permissions)

  • సంబంధిత అథారిటీ / యజమాని / అసోసియేషన్ నుంచి అనుమతి ఉందా..? (అవును అయితే, అనుమతి ప్రక్రియలో సమయంలో యజమాని నుంచి సమ్మతి లేఖ లేదా మున్సిపల్ / సంబంధిత అథారిటీ నుంచి అధికారిక అనుమతి లేఖను పోలీసులకు సమర్పించాలి)
  • విద్యుత్ కనెక్షన్‌ల కోసం ట్రాన్స్‌కో నుంచి సమ్మతి పొందారా..?(అవును అయితే, అనుమతి ప్రక్రియ సమయంలో TSSPDCL నుంచి అనుమతి లేఖను పోలీసులకు సమర్పించాలి)
  • లౌడ్ స్పీకర్ల ప్రతిపాదన ఏమైనా ఉందా..? (అవును అయితే, సంబంధిత ACPల నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి)
  • సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా..? (అవును అయితే, ప్రతి నిర్దిష్ట ప్రోగ్రామ్/కార్యకలాపాల కోసం సంబంధిత ACPల నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి)
  • అలా అన్ని వివరాలు ఎంటర్​ చేసిన తర్వాత.. డిక్లరేషన్​ బాక్స్​లో టిక్​ చేసి.. అనంతరం Captcha ఎంటర్​ చేసి.. తర్వాత సేవ్​ చేసి Generate Acknowledgement ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • ఈ ఫారమ్‌ను పూరించిన తర్వాత, దరఖాస్తుదారుడు.. అప్లికేషన్​ ఫారమ్‌తో పాటు కంప్యూటర్‌లో రూపొందించిన అక్నాలెడ్జ్‌మెంట్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలి.

Ganesh Chaturthi 2023 Telangana : జై బోలో మట్టి గణపతికీ.. మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం

Pollution Control Board Distribute Clay Ganesh Idols : హైదరాబాద్​లో 2 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ.. ఏర్పాట్లు చేస్తున్న పీసీబీ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.