ETV Bharat / state

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గణేశ్ చతుర్థి వేడుకలు

author img

By

Published : Aug 22, 2020, 1:10 PM IST

హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గణేశ్ చతుర్థి వేడుకలు నిర్వహించారు. కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని లంబోదరుడిని వేడుకున్నట్లు నేతలు తెలిపారు.

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గణేశ్ చతుర్థి వేడుకలు
భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గణేశ్ చతుర్థి వేడుకలు

వినాయక చవితి వేడుకలను భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారి శృతి, శ్రీనివాస్ గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

ప్రజలకు విఘ్నాలు తొలగి విజయం చేకూర్చాలని ప్రార్థించినట్లు నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రజానీకం సుఖ సంతోషాలతో జీవించాలంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నుంచి విజయం సాధించేలా ప్రజలందరినీ విఘ్నేశ్వరుడు దీవిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. భాజపా అన్ని కార్యక్రమాల్లోనూ విజయం సాధించేలా ఆశీర్వదించాలని వేడుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : మూషికా..! మనం వచ్చింది భూలోకానికేనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.