ETV Bharat / state

Ganesh Chaturthi 2023 : గణేశ్‌ ఉత్సవాలకు ముస్తాబవుతోన్న తెలంగాణ.. ఈసారి మట్టి గణపయ్యను పూజిద్దామా..

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 10:03 AM IST

Ganesh Chaturthi 2023 in Telangana : గణేశ్‌ ఉత్సవాలకు రాష్ట్రం ముస్తాబవుతోంది. వాడవాడలా బొజ్జ గణపయ్యను నిలిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో విగ్రహాల కొనుగోళ్లు, మండపాలకు తరలింపు జోరుగా కొనసాగుతోంది. మట్టి వినాయకులనే పూజించాలంటూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.

Clay Ganesh Idols Telangana 2023
Clay Ganesh Idols

Clay Ganesh Idols Telangana 2023 మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం

Ganesh Chaturthi 2023 in Telangana : వినాయక చవితి(Ganesh Chaturthi 2023) వచ్చిందంటే చాలు.. చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకుంటారు. గణేశ్‌ విగ్రహాల విషయంలోనూ ప్రత్యేకత చాటాలని భావిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు 0.8 సెంటీమీటర్ల పొడువుతో.. బుజ్జి వినాయకులని తయారుచేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. 108 మట్టి విగ్రహాలను స్వయంగా తయారు చేసి ఉచితంగా పంపిణీ చేశాడు. మట్టి వినాయకులనే(Clay Ganesh Idols in Telangana) పూజించాలనే అవగాహన క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా కృషి చేస్తున్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.

Clay Ganesh Idols 2023 : నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో మట్టి విగ్రహాలను తయారు చేయించింది. మట్టితో చేసిన విగ్రహాల వల్ల జరిగే మేలును చిన్నారులకు వివరించారు. మంచిర్యాల జిల్లా గద్దరగడిలోని ఓ పాఠశాలలో మట్టి, ఆకులతో.. గణేశుడిని తయారు చేశారు. నిర్మల్‌లో చిన్నారులు తమ చిట్టిపొట్టి చేతులతో మట్టి విగ్రహాలను రూపొందించారు. ఆదిలాబాద్‌ బీసీ స్టడీ సర్కిల్(Adilabad BC Study Circle) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ లంబోదరుడి ప్రతిమల్ని పంపిణీ చేశారు.

Vinayaka Chavithi 2023 Pooja Vidhanam Telugu : వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి..? పూజా విధానం ఏంటి..?

Khairatabad Ganesh 2023 : హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిలిచే ఖైరతాబాద్ వినాయకుడిని(63 Feet Vinayaka in Khairatabad) పర్యావరణ హితంగా మట్టితోనే రూపొందించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రచారంతో.. పీవోపీ స్థానంలో మళ్లీ మట్టితో చేసిన విగ్రహాలనే.. నెలకొల్పేందుకు ప్రజలు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. హెచ్​ఎండీఏ(HMDA) ఎకోఫ్రెండ్లీ సీడ్ వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ సీడ్ విగ్రహాలను నవరాత్రి పూజల అనంతరం.. తొట్టిలోనే పెట్టి నీరు పోస్తే విత్తనం మొలకెత్తుతుంది. ఇక జీహెచ్​ఎంసీ(GHMC) పరిధిలోని 150 వార్డు కార్యాలయాల్లో ఉచితంగా మట్టి విగ్రహాలను అందుబాటులో ఉంచారు. సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ పార్కు, ట్యాంక్ బండ్ వద్ద కూడా పంపిణీ చేస్తున్నారు. అశోక్‌నగర్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌.. మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

GHMC Officials Focus on Ganesh Idols Immersion Places : పీపుల్స్‌ ప్లాజా చెంత.. కింకర్తవ్యం?

చూపరులను ఆకట్టుకుంటున్న వినాయక ప్రతిమలు : పీవోపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలు.. వివిధ రూపాల్లో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. విగ్రహాల తయరీదారులు ప్రతిమలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రెండు అడుగుల నుంచి 30 అడుగుల ఎత్తున్న లంబోదరుడి విగ్రహాలను కళాకారులు తయారు చేశారు. ఈ ఏడాది ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయని.. దీంతో కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని తయారీదారులు చెబుతున్నారు.

Khairatabad Ganesh ready for Visit : ఖైరతాబాద్ మహాగణపతి 63 అడుగుల విగ్రహం సిద్ధం.. సందర్శనకు రెడీ..

Clay Ganesh Idols Telangana : ప్రకృతిని ప్రేమిద్దాం.. మట్టి గణపయ్యను పూజిద్దాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.