ETV Bharat / state

Ap News: ప్రభుత్వ ఉద్యోగులకు 3.1% డీఏ పెంపు

author img

By

Published : Aug 1, 2021, 9:19 AM IST

DA
డీఏ పెంపు

ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఉద్యోగులు, పింఛనుదారులకు కరవు భత్యాన్ని(డీఏ) 3.144% పెంచుతూ శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని పేర్కొంది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరవు భత్యాన్ని(డీఏ) 3.144% పెంచుతూ ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని పేర్కొంది. పెంచిన డీఏను జులై 2021 నుంచి మూడు సమాన విడతల్లో చెల్లిస్తామంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల డీఏ... మూల వేతనంపై 30.392% నుంచి 33.536 శాతానికి పెరిగింది.

పెన్షనర్లకు 2019 జులై ఒకటి నుంచి 5.24% పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీన్ని 2022 జనవరి నుంచి చెల్లిస్తామని వెల్లడించింది. దీంతో కలిపి పెన్షనర్ల డీఏ వచ్చే జనవరి నుంచి 33.536% నుంచి 38.776 శాతానికి పెరుగుతుందని తెలిపింది. డీఏను ఓపీఎస్‌ విధానంలోని వారికి జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు 90% వేతనంలో, 10% ప్రాన్‌ ఖాతాలో జమ చేస్తారు.

ఇదీ చూడండి: Kidnap: అడిగిన డబ్బు ఇవ్వకపోతే మన బాబును చంపేస్తా.. చివరికి ఏం జరిగిందంటే !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.