ETV Bharat / state

Minister Srinivas Goud: హైదరాబాద్​ను క్రీడా హబ్​గా మారుస్తాం

author img

By

Published : Jul 7, 2021, 2:33 PM IST

క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్యాడ్మింటన్ స్టేడియంలో ఒలింపిక్స్ క్రీడాకారులకు సన్మానం చేశారు.

Minister Srinivas Goud
మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

టోక్యో ఒలింపిక్స్ (TOKYO OLYMPICS)​కు వెళ్లే క్రీడాకారులకు, కోచ్​లకు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ (MINISTER SRINIVAS GOUD)సన్మానం చేశారు. హైదరాబాద్​ గచ్చిబౌలి బ్యాడ్మింటన్ స్టేడియం (GACHIBOWLI BADMINTON STADIUM)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుల్లెల గోపిచంద్, పి.వి. సింధు, సాయి ప్రణీత్, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు. స్టేడియంలోని క్రీడాకారులతో సింధు బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు.

అనంతరం రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ (OLYMPICS)​కు ఎంపికైన పి.వి.సింధు, సాయి ప్రణీత్​ను సన్మానించారు. అదే సమయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. వేదికపైకి వెళ్లేందుకు క్రీడాకారులు, కోచ్​లు నిరాకరించారు. కరోనా దృష్ట్యా వేదికపై ఎక్కువమంది ఉండటంతో వెనుకాడారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్ జోక్యంతో క్రీడాకారులు వేదిక వద్దకు వెళ్లారు. మంత్రి వారికి సన్మానించి అభినందించారు.

''ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడాభివృద్దికి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నాం. క్రీడా పాలసీ తయారీకి క్రీడల అభివృద్ది మౌలిక సదుపాయాల కల్పన కోసం కేబినేట్ సబ్‌కమిటీని నియమించింది. మంగళవారం ఈ అంశంపై మంత్రి కేటీఆర్​తో చర్చించాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు ఇప్పటివరకు రూ. 25కోట్ల 87లక్షల నగదు ప్రోత్సహకాలను అందించాం.

హైదరాబాద్​లో కోచింగ్​ తీసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ.. భారతదేశానికే గొప్ప పేరు తెచ్చేట్లు ముందుకు పోవడం సంతోషించదగిన విషయం. ప్రజలు అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. చదువులోనూ, క్రీడల్లోనూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. క్రీడాకారులను, కోచ్​లను ప్రోత్సహించేలా కృషి చేస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్​లో ఆడి గెలిచి పతకాలు తెచ్చినవారికి గొప్పగా సన్మానం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వారికి అన్నిరకాల సహాయ సహకారాలు అందేలా చూడాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్టేడియాలు నిర్మిస్తున్నాం. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్​ను అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రారంభించాం. హైదరాబాద్​ను క్రీడా హబ్​గా మార్చేలా కృషి చేస్తున్నాం.''

-మంత్రి శ్రీనివాస్​గౌడ్

టోక్యో ఒలింపిక్స్ (TOKYO OLYMPICS)లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి పతకాలు సాధించి... రాష్ట్రానికి మంచి పేరు. ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కోరారు. దేశం నుంచి ఒలింపిక్స్​కు ఎన్నికైన వారు భారతదేశం గర్వపడేలా ప్రతిభను కనబరచాలని విజ్ఞప్తి చేశారు.

సానియా మీర్జాకు పురస్కారం

టోక్యోలో జరగనున్న ఒలంపిక్స్‌ క్రీడలకు మన దేశం నుంచి టెన్నిస్ విభాగంలో ఎంపికైన సానియా మీర్జా తరఫున... ఆమె తండ్రి ఇమ్రాన్‌ మీర్జాను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఘనంగా సన్మానించారు. హైదరాబాద్​లోని మంత్రి ఇంటికి పిలిచి... రాష్ట్ర క్రీడాశాఖ తరఫు రూ.5లక్షల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ ఛైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఇదీ చూడండి: Srinivas goud: ఒలంపిక్స్​కు ఎంపికైన తెలంగాణ బిడ్డకు మంత్రి సన్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.