ETV Bharat / state

Power Usage in Telangana: యాసంగిలో తగ్గిన విద్యుత్​ వినియోగం.. ఎందుకంటే?

author img

By

Published : Jan 30, 2022, 8:06 AM IST

Power Usage in Telangana: తెలంగాణలో యాసంగి సాగు తగ్గడం వల్ల ఆ మేరకు విద్యుత్​ వినియోగం సైతం తగ్గింది. గత రెండు నెలలుగా రాష్ట్రంలో 745 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కరెంటు వినియోగం తగ్గినట్లు సమాచారం.

electricity usage in telangana
electricity usage in telangana

Power Usage in Telangana: ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో కరెంటు వాడకం అదే స్థాయిలో తక్కువై.. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు పరోక్షంగా రూ.వందల కోట్ల సొమ్ము మిగులుతోంది. గత రెండు నెలలుగా రాష్ట్రంలో 745 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కరెంటు వినియోగం తగ్గినట్లు ట్రాన్స్‌కో రోజువారీ విద్యుత్‌ వినియోగం నివేదికను పరిశీలిస్తే తెలుస్తోంది. గతేడాది యాసంగితో వరి సాగు విస్తీర్ణాన్ని పోలిస్తే ఈసారి 14 లక్షల ఎకరాలు తగ్గడంతో ఆ మేర వ్యవసాయ బోర్లకు విద్యుత్తు వాడకంలో తేడా వచ్చింది. గతేడాది యాసంగి(2020-21)లో రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 52.30 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 2021 జనవరి 27నాటికే 27.95 లక్షల ఎకరాల్లో వేయగా ఈ ఏడాది అదే తేదీకి అంతకన్నా 14 లక్షల ఎకరాలు తక్కువగా సాగవ్వడం గమనార్హం.

ఇలా తగ్గింది

  • Power Usage in Kharif in Telangana : గతేడాది యాసంగి పంటల సాగు ముమ్మరంగా ఉన్నపుడు 2021 జనవరి 22న అత్యధికంగా 13,157 మెగావాట్ల విద్యుత్‌ డిమాండు నమోదైంది. 2021 జనవరి 23న 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 247 ఎంయూల కరెంటును ప్రజలు, వ్యవసాయానికి వినియోగించారు. ఈ ఏడాది(2022) జనవరిలో 1 నుంచి 29 వరకూ పరిశీలిస్తే 7న అత్యధికంగా 210 ఎంయూలు కరెంటు వాడకం రోజువారీ అత్యధిక వినియోగ రికార్డు. గతేడాది జనవరితో పోలిస్తే రోజువారీ రికార్డు వినియోగం 37 ఎంయూలు తగ్గింది.
  • రాష్ట్రంలో యూనిట్‌ కరెంటు సరఫరాకు సగటు వ్యయం (ఏసీఎస్‌) రూ.7.14 అవుతుంది. ఈ లెక్కన 745 మిలియన్‌ యూనిట్లకు రూ.531.93 కోట్లు ఆదా అయింది. కానీ వ్యవసాయానికి యూనిట్‌కు రూ.8.96 దాకా వ్యయం అవుతోందని ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఇటీవల రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. ఆ ధరతో లెక్కిస్తే ఇంకా మిగులు కనిపిస్తుంది.

ఇదీచూడండి: Temperatures Dropped: చలిపులి పంజా.. తెలంగాణను వణికిస్తున్న శీతలగాలులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.