ETV Bharat / state

రైతుబంధు ఖాతాల్లో రూ. 5,660 కోట్లు జమ

author img

By

Published : Jan 4, 2021, 7:36 PM IST

రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అమలవుతోంది. 2020-21 యాసంగి సీజన్​కు సంబంధించి సాయాన్ని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 111.22 లక్షల ఎకరాలకు గాను రూ. 5,660 కోట్లకు పైగా నగదును అందజేసింది.

rythu bandhu, telangana, rabi crop
రైతు బంధు, పెట్టుబడిసాయం, తెలంగాణ

రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. 2020- 21 యాసంగి సీజన్​కు సంబంధించి ఈ పథకం కింద పెట్టుబడి సాయం ప్రభుత్వం అందిస్తోంది. సోమవారం వరకు 55 లక్షల 58 వేల 393 మంది రైతులకు ప్రభుత్వం అందజేసింది. 111. 22 లక్షల ఎకరాలకుగాను రూ. 5660.87 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా వ్యవసాయ శాఖ జమ చేసింది.

జిల్లాల వారీ పరిశీలిస్తే...

జిల్లాలుమొత్తం పట్టాదారులుపెట్టుబడిసాయం(రూపాయల్లో)
ఆదిలాబాద్1,21,944 184 కోట్ల 87 లక్షల 81 వేల 605
ఖమ్మం2,76,414262 కోట్ల 75 లక్షల 23 వేల 858
జగిత్యాల1,91,824 169 కోట్ల 36 లక్షల 75 వేల 700
భద్రాద్రి కొత్తగూడెం 1,18,174 134 కోట్ల 13 లక్షల 2,135
జనగామ1,41,544 154 కోట్ల 96 లక్షల 90 వేల 124
నల్గొండ4,09,389 446 కోట్ల 52 లక్షల 58 వేల 562
జయశంకర్ భూపాపల్లి 97,915 96 కోట్ల 9 లక్షల 40 వేల 178
జోగులాంబ గద్వాల 1,32,522 155 కోట్ల 42 లక్షల 69 వేల 738
కరీంనగర్ 1,61,385 145 కోట్ల 62 లక్షల 97 వేల 766
మెదక్2,10,311 167 కోట్ల 33 లక్షల 80 వేల 333
సిద్దిపేట 2,59,242 237 కోట్ల 13 లక్షల 53 వేల 137
సంగారెడ్డి2,74,023 273 కోట్ల 32 లక్షల 64 వేల 593
సూర్యాపేట 2,30,861 237 కోట్ల 13 లక్షల 53 వేల 137
కుమురం భీం ఆసిఫాబాద్ 94,271 122 కోట్ల 53 లక్షల 79 వేల 727

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 55 లక్షల 48 వేల 393 మంది రైతులకు రూ. 5, 660 కోట్ల 87 లక్షల 16 వేల 170 జమ చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: 'సన్నబియ్యం పంపిణీ పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.