ETV Bharat / state

పెట్రో నిరసన: ఆటోని తాడుతో లాగుతూ ఆందోళన!

author img

By

Published : Feb 11, 2021, 11:48 AM IST

different protest citu due to increasing of petrol and diesel cost at baghlingampally in hyderabad
పెట్రో నిరసన: ఆటోని తాడుతో లాగుతూ ఆందోళన!

పెరిగిన పెట్రో ధరలను నిరసిస్తూ సీఐటీయూ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఇంధన ధరలు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆరోపించారు. బాగ్​లింగంపల్లిలో ప్రయాణికులు కూర్చున్న ఆటోను తాడుతో లాగుతూ ఆందోళన వ్యక్తం చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆలిండియా రోడ్ ట్రాన్స్​పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చౌరస్తా వరకు ప్రయాణికులు కూర్చున్న ఆటోకు తాడు కట్టి లాగుతూ సీఐటీయూ వినూత్నంగా ఆందోళన చేపట్టింది.

పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఇంధనం ధరలు పెరగడం వల్ల రవాణా రంగం పూర్తిగా కుదేలైందని... కరోనా కష్టకాలంలో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రవాణా రంగం కార్మికులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: మేయర్​ ఎన్నికలో కీలకంగా పతంగి... అసలు వ్యూహమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.