ETV Bharat / state

అప్రమత్తంగా ఉండండి: డీజీపీ మహేందర్​ రెడ్డి

author img

By

Published : Oct 17, 2020, 10:40 PM IST

హైదరాబాద్​తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డీజీపీ మహేందర్​ రెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో గ్రేటర్ హైదరాబాద్​లోని పరిస్థితులపై సమీక్షించారు.

dgp mahender reddy review with hyderabad, sybarabad, rachakonda commissioners
అప్రమత్తంగా ఉండండి: డీజీపీ మహేందర్​ రెడ్డి

డీజీపీ మహేందర్​ రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో గ్రేటర్ హైదరాబాద్​లోని పరిస్థితులపై సమీక్షించారు. హైదరాబాద్​తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డీజీపీ మహేందర్​ రెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

జీహెచ్ఎంసీతో పాటు, జిల్లాల్లో కలెక్టర్, వివిధ శాఖలతో కలసి సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటల సమీపంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున అప్రమత్తతో ఉండాలని డీజీపీ ఆదేశించారు.

ఇదీ చదవండి: వరదతో ట్రాఫిక్​ జామ్​.. ఈత కొట్టుకుంటూ వెళ్లిన వ్యక్తి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.