ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Jan 28, 2023, 10:24 PM IST

Updated : Jan 29, 2023, 11:19 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ
రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ

22:22 January 28

రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో భారీగా పోలీస్​ అధికారుల బ‌దిలీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఖాళీగా స్థానాల్లో పోస్టింగ్​లు ఇస్తూ డీజీపీ అంజనీకూమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హైద‌రాబాద్‌లోని సీఐడీ విభాగంలో డీఎస్పీగా ఉన్న జె.వెంక‌ట‌రెడ్డిని నారాయ‌ణ్‌ఖేడ్‌కు బ‌దిలీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏసీపీగా పని చేస్తున్న ఎన్.వెంకటేశ్​ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీగా ట్రాన్స్​ఫర్ చేశారు. ఇప్పుడు పాల్వంచ డీఎస్పీగా పని చేస్తున్న తాల్లపెల్లి సత్యనారాయణను హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

బాసర రాజీవ్ యూనివర్సిటీ డీఎస్పీగా పని చేస్తున్న వీపూరి సురేశ్​ను కామారెడ్డి డీఎస్పీగా బదిలీ చేశారు. ఇప్పుడు కామారెడ్డి డీఎస్పీగా పని చేస్తున్న సోమనాథాన్ని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఐడీలో సైబర్ క్రైమ్స్ వింగ్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న బి.రవికుమార్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ డిపార్ట్​మెంట్ డీఎస్పీగా ట్రాన్స్​ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీసీఎస్ ఏసీపీగా పని చేస్తున్న వై. వెంకటరెడ్డిని కుషాయిగూడ ఏసీపీగా బదిలీ చేశారు. వరంగల్ సీఎస్బీ ఏసీపీగా పని చేస్తున్న ఎస్కే అబ్దుల్ రెహమాన్​ను కొత్తగూడెం ఎస్డీపీవోగా బదిలీ చేశారు. అక్కడ డీఎస్పీగా పని చేస్తున్న జి.వెంకటేశ్వర బాబును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

కుమురం భీం ఆసిఫాబాద్ ఫంక్షనల్ వెర్టికల్స్ డీసీఆర్బీ డీఎస్పీగా పని చేస్తున్న సీహెచ్ నాగేందర్​ను ఉట్నూర్ సబ్ డివిజన్ ఎస్డీపీవోగా బదిలీ చేశారు. హైదరాబాద్​లోని ఇంటెలిజెన్స్ వింగ్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పూనాటి నర్సింహారావును మియాపూర్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ పని చేస్తున్న ఎస్.కృష్ణ ప్రసాద్​ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ వింగ్ డీఎస్పీగా పని చేస్తున్న పి.వెంకటగిరిని మియాపూర్ డీఎస్పీగా ట్రాన్స్​ఫర్ చేశారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న బంటు కిషన్​ను వరంగల్ సీసీఆర్బీ ఏసీపీగా నియమించారు.

మెదక్ జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కె.బాలకృష్ణారెడ్డిని హైదరాబాద్ మెట్రో రైల్​కు బదిలీ చేశారు. పంజాగుట్ట ఏసీపీగా పని చేస్తున్న పీవీ గణేశ్​ను ఖమ్మం టౌన్ ఏసీపీగా నియమించారు. ఇప్పుడు ఖమ్మం టౌన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న బి.ఆంజనేయులును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట ఏసీపీగా ప్రస్తుతం సీసీఎస్ విభాగం ఏసీపీగా పని చేస్తున్న ఎస్.మోహన్​కుమార్​ను నియమించారు. మిర్యాలగూడ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వై.వెంకటేశ్వరరావును ఖమ్మం టాస్క్​ఫోర్స్ ఏసీపీగా నియమించారు. బెల్లంపల్లి ఏసీపీ ఎ.మహేశ్​ను పెద్దపల్లి ఏసీపీగా బదిలీ చేశారు. పెద్దపల్లి ఏసీపీగా పని చేస్తున్న సారందపాణి సాదులను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

డీజీపీ ఆఫీసులో రోడ్ సేఫ్టీ డీఎస్పీగా పని చేస్తున్న శామల వెంకట్ రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా ట్రాన్స్​ఫర్ చేశారు. వరంగల్ సీసీఆర్బీ, ఫంక్షనల్ వెర్టికల్స్ విభాగం ఏసీపీగా పని చేస్తున్న టి.కృపాకర్​ను మమ్మూర్ ఏసీపీగా బదిలీ చేశారు. అక్కడ ఏసీపీగా ఉన్న నరేశ్ కుమార్​ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. భువనగిరి ట్రైనీ ఏసీపీగా ఉన్న ఎన్.సైదులును రాచకొండ-యాదాద్రి ఏసీపీగా పోస్ట్ చేశారు. అక్కడ ఏసీపీగా పని చేస్తున్న వై.నరసింహారెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జీవీ రమణ గౌడ్​ను నార్సింగి ఏసీపీగా ట్రాన్స్​ఫర్ చేశారు. ఎల్బీ నగర్ ట్రైనీ ఏసీపీగా పని చేస్తున్న సి.అంజయ్యను మహేశ్వరం ఎల్ అండ్ ఓ ఏసీపీగా నియమించారు.

నల్గొండ డీటీసీగా పని చేస్తున్న కాపుగంటి శ్రీనివాసరావును హైదరాబాద్ సౌత్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా నియమించారు. అక్కడ పని చేస్తున్న వి.శ్రీనివాసరెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సైబరాబాద్ సీఏఆర్, సీఎస్​డబ్ల్యూ ఏసీపీగా ఉన్న పి.ధనలక్ష్మిని కూకట్​పల్లి ఏసీపీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న జి.హనుమంత రావును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ వింగ్ డీఎస్పీగా ఉన్న పూర్ణ చందర్​ను అబిడ్స్ ఏసీపీగా ట్రాన్స్​ఫర్ చేశారు. ఇప్పటివరకు అబిడ్స్ ఏసీపీగా ఉన్న కడారు వెంకట్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి డీటీసీ డీఎస్పీగా ఉన్న సామిండ్ల ప్రభాకర్​ను చేవెళ్ల ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ప్రస్తుతం చేవెళ్ల ఏసీపీగా ఉన్న పైలా రవీందర్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ సిటీ సీసీఎస్-డీడీ ఏసీపీగా ఉన్న ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని మీర్ చౌక్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఇంటెలిజెన్స్ వింగ్ డీఎస్పీ మహమ్మద్ గౌస్​ను సంతోష్ నగర్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ప్రమోటెడ్ ఏసీపీ రుద్ర భాస్కర్​ను చార్మినార్ ఏసీపీగా నియమించారు. సీఐడీ డీఎస్పీ జి.శ్యామ్ సుందర్​ను మలక్​పేట ఏసీపీగా నియమించారు. మలక్​పేట ఏసీపీగా ఉన్న ఎన్.వెంకట రమణను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి..

రాష్ట్రంలో 91 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హిండెన్‌బర్గ్‌ నివేదికపై కేంద్రానికి KTR ప్రశ్నల వర్షం.. అవి ఏంటంటే?

Last Updated : Jan 29, 2023, 11:19 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.