ETV Bharat / state

ఓట్ల లెక్కింపుపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు - ఆ విషయంలో అలెర్ట్​గా ఉండాలంటూ ఆదేశాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 6:32 PM IST

Telangana Assembly Elections 2023
DGP Anjani Kumar Gives Instructions to Police on Vote Counting

DGP Anjani Kumar Gives Instructions to Police on Vote Counting : రాష్ట్రంలో కీలకంగా సాగిన ఎన్నికల పోరులో తుది అంకానికి మరికొద్ది గంటల సమయమే ఉండటంతో, రాష్ట్ర పోలీసు యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాగల రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

DGP Anjani Kumar Gives Instructions to Police on Vote Counting : రాష్ట్రంలో ఆసక్తికరంగా మారిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సర్వం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. ఈ క్రమంలో సీపీలు, ఎస్పీలతో డీజీపీ టెలికాన్ఫరెన్స్(Teleconference) నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా పెట్టాలని, కేంద్రాల లోపల సైతం దృష్టి సారించాలని డీజీపీ సూచించారు.

రేపే జడ్జిమెంట్ డే- ఎలక్షన్ కౌంటింగ్​కు ఈసీ ఏర్పాట్లు పూర్తి

చివరి కౌంటింగ్ రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరినీ గుమిగూడనివ్వొద్దని, పికెటింగ్ చేయడంతో పాటు, అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలని పోలీస్ అధికారులకు డీజీపీ సూచించారు. గెలుపొందిన పార్టీ అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు(Victory Rallies) ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ప్రతీకారదాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?

DGP Gives Key Instructions to Police : పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోలీస్ అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎవరు గెలుపొందినా పోలీసులకు సహరించేలా వివరించాలని అంజనీ కుమార్ అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి విఘాతం లేకుండా ఎన్నికల బందోబస్తు(Election Provision) నిర్వహించామని, ఈ రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సీపీలు, ఎస్పీలకు అంజనీ కుమార్‌ ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా ఇప్పటికే పోలీసు యంత్రాంగం కట్టుదిట్టంగా విధులు నిర్వర్తిస్తుంది. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు ఉందని, ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ర్యాలీలకు, బాణాసంచా(Fireworks) కాల్చేందుకు అనుమతి లేదని రాచకొండ సీపీ చౌహాన్ వివరించారు. అదేవిధంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్​ల వద్ద కేంద్ర సాయుధ బలగాలు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఉన్న 49 కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్(Vikas Raj) వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసుల్లో సుమారు 13 వేల మందిపై ఎఫ్ఐఆర్​లు నమోదయ్యాయని ఆయన తెలిపారు. అదేవిధంగా 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతుందన్నారు. 500లకు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​ - డీఏ విడుదలకు ఈసీ అనుమతి

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - రేపు వైన్ షాపులు, రెస్టారెంట్లు బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.