Podu lands: 'పోడు'పై అసెంబ్లీలో చర్చిద్దాం.. వారికి మరో అవకాశమిద్దాం: కేసీఆర్

author img

By

Published : Oct 3, 2021, 5:09 AM IST

Updated : Oct 3, 2021, 7:15 AM IST

debate-on-land-issues-in-the-legislature-say-cm-kcr

పోడు భూముల సమస్యలపై సోమవారం శాసనసభలో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr) నిర్ణయించారు. అటవీ భూములపై హక్కు గుర్తింపు చట్టం (RVFR) కింద గడువు (కటాఫ్‌ తేదీ)ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయించనున్నారు.

పోడు భూముల సమస్యలపై సోమవారం శాసనసభలో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr) నిర్ణయించారు. అటవీ భూములపై హక్కు గుర్తింపు చట్టం (RVFR) కింద గడువు (కటాఫ్‌ తేదీ)ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయించనున్నారు. గడువు పెంపుదలతో పాటు దీని కింద గతంలో దరఖాస్తులు చేసుకొని తిరస్కరణకు గురైన వారికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. శనివారం ప్రగతిభవన్‌లో పోడుభూముల సమస్యపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు సత్యవతి రాఠోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం..

పోడుభూముల సమస్య పరిష్కారానికి యూపీఏ ప్రభుత్వం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టాన్ని (RVFR ACT) తెచ్చిందని సీఎం అన్నారు. 2005 వరకు పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న వారిని గుర్తించి పట్టాలిచ్చారన్నారు. రాష్ట్రంలో ఆ గడువు నాటికి 96 వేల మంది లబ్ధి పొందారన్నారు. అప్పట్లో చాలా మంది దరఖాస్తు చేసుకున్నా సాంకేతిక కారణాలతో తిరస్కరించారని, వారికి మరో అవకాశం ఇవ్వలేదన్నారు. కటాఫ్‌ తేదీని పొడిగించడంతో పాటు మరోసారి దరఖాస్తుకు అవకాశం ఇస్తే గిరిజనులకు భారీఎత్తున మేలు జరుగుతుందన్నారు. ఆరు లక్షల ఎకరాలకు పట్టాలివ్వడానికి వీలుంటుందని తెలిపారు. దీనిపై సోమవారం శాసనససభలో ప్రశ్నోత్తరాల అనంతరం చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేద్దామన్నారు. దీనికి సంబంధించి, సమగ్ర సమాచారం సిద్ధంచేయాలని సీఎం అధికారులకు సూచించారు. తీర్మానం తర్వాత అఖిలపక్ష నేతలతో కలిసి దిల్లీకి వెళ్లి పరిష్కరించాలని ప్రధానిని కోరతామన్నారు.

మంత్రివర్గ ఉపసంఘం భేటీ..

అంతకుముందు బీఆర్‌కేభవన్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన పోడుభూములపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ భూముల సమస్య పరిష్కారానికి నివేదిక రూపొందించింది. అనంతరం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు సమర్పించింది.

ఇదీ చదవండి: Revanth reddy comments: 'శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌ అనుమతి కావాలా'

Last Updated :Oct 3, 2021, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.