ETV Bharat / state

'దాసరి' కుటుంబంలో ఆస్తి తగాదాలు

author img

By

Published : Jun 26, 2020, 4:37 PM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పోలీస్​స్టేషన్​లో దాసరి నారాయణరావు చిన్న కుమారుడు అరుణ్​పై దాసరి పెద్ద కొడుకు ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Dasari narayanarao family disputes between his sons
'దాసరి' కుటుంబంలో ఆస్తి తగాదాలు

ప్రముఖ దర్శకులు డాక్టర్​ దాసరి నారాయణ రావు... చిన్నకుమారుడు అరుణ్​పై పెద్ద కుమారుడు ప్రభు... జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి తగాదాల కారణంగా బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం రోజు అరుణ్‌, అతడి భార్య... తమ ఇంటికి వచ్చి దూషించినట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని వివరించారు. ఓ ఆస్తికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నప్పటికీ.... బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇందుకు తన చెల్లెలు, ఆమె బంధువులు సహకరిస్తున్నారని అన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

'దాసరి' కుటుంబంలో ఆస్తి తగాదాలు

ఇవీ చూడండి: ఉద్యోగాల భర్తీపై సర్కారు చేతులెత్తేసింది : కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.