ETV Bharat / state

అంతర్​రాష్ట్ర ముఠాపై పీడీ యాక్ట్​ నమోదు

author img

By

Published : Apr 28, 2021, 5:38 PM IST

దొంగతనానికి పాల్పడుతున్న అంతర్​రాష్ట్ర ముఠాపై పీడీ యాక్ట్ నమోదైంది. రాజస్థాన్​, ఉత్తరప్రదేశ్​కు చెందిన 9మంది ముఠాగా ఏర్పడి.. నగరంలోని పలువురిని బెదిరించి... లక్షల విలువైన విద్యుత్ సామగ్రిని ఎత్తుకెళ్లారు.

PD Act registration on interstate gang
అంతర్​రాష్ట్ర ముఠాపై పీడీ యాక్ట్​ నమోదు

దొంగతనానికి పాల్పడుతున్న అంతర్​రాష్ట్ర ముఠాపై పీడీ యాక్ట్​ను సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. రాజస్థాన్​, ఉత్తరప్రదేశ్​కు చెందిన 9మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లు నగరంలో పలు వెంచర్లలో కాంట్రాక్టర్ల వద్ద ఎలక్ట్రిషన్లుగా చేరి.. విద్యుత్​ సామగ్రిని గదిలకు తరలించేవారు. దీనితో డబ్బుకు ఆశపడిన ముఠా సైబరాబాద్​ పరిధిలోని దుండిగల్​, శంకరపల్లి, ఆర్సిపురం, నార్సింగ్​ ప్రాంతాల్లోని పలు వెంచర్లలో కాపాలదారులను మారణయుధాలతో బెదిరించి విద్యుత్​ సామగ్రి దొంగతానికి పాల్పడడం ప్రారంభించారు. జనవరిలో దుండిగల్ పరిధి మల్లంపేటలోని రెండు కార్లలో వచ్చి.. ఓ వెంచర్​లో కాపాలదారులను కట్టేసి వారిని మారణయుధాలతో బెదిరించి లక్షల విలువైన విద్యుత్ సామగ్రిని ఎత్తుకెళ్లారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి చోరీ చేసిన ముఠాను జనవరిలోనే అరెస్ట్ చేశారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ. 9.5 లక్షలు నగదు, 8 మొబైల్ ఫోన్లు, రెండు కార్లు, మారణాయుధాలు మరియు దొంగిలించబడిన విద్యుత్ సామగ్రిని స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్​కు తరలించారు. విచారణలో ఈ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతుండడంతో తొమ్మిది మంది ముఠాపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.