ETV Bharat / state

రాష్ట్రంలో కలవరపెడుతున్న కరోనా - తాజాగా 12 కేసులు నమోదు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 7:43 PM IST

Updated : Dec 23, 2023, 10:27 PM IST

Covid Cases Update
Covid Cases Increased in Telangana

Covid Cases Increased in Telangana : రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి రోజురోజుకు అంతకంతకు జడలు విప్పుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 38కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఒకరు కోలుకున్నారు.

Covid Cases Increased in Telangana : రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,322 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 12 పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా యాక్టివ్ కేసుల(Covid Active Cases) సంఖ్య 38కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఒకరు కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొవిడ్ స్టేటస్ బులిటెన్‌ విడుదల చేసింది.

Health Minister Raja Narsimha Review on Covid 19 Cases
Telangana Govt Releases Covid Health Bulletin

కొత్త వేరియంట్​తో భయం వద్దు - జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న వైద్యులు

కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, వరంగల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. అదేవిధంగా నిలోఫర్ ఆస్పత్రిలో 6 నెలల చిన్నారి కరోనా బారినపడింది. రాష్ట్రంలో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

Health Minister Raja Narsimha Review on Covid 19 Cases : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రమంగా వ్యాపిస్తున్న కరోనాను అరికట్టేందుకు ఉన్న వసతుల గురించి మంత్రి ఆరాతీశారు. ఆక్సిజన్‌ సిలిండర్లను(Oxygen Cylinders) సరైన తీరుగా వినియోగించడం, పూర్తిస్థాయిలో వెంటిలేటర్లు పనిచేసేలా చేయడం వంటి విషయాలను కూలంకుషంగా చర్చించారు.

Corona Cases Increasing in Telangana : ప్రభుత్వ పరిధిలోని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లలో 16,500 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు, వాటితో పాటు రాష్ట్రంలో మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్‌ ల్యాబులు ఉన్నట్లు అధికారులు వివరించారు. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఆర్టీపీసీఆర్‌ కిట్లను అందజేయాలని మంత్రి రాజనర్సింహా ఆదేశించారు.

'ప్రతి 3 నెలలకోసారి మాక్ డ్రిల్​'- కొవిడ్ కేసులపై కేంద్రం అలర్ట్

Telangana Govt Releases Covid Health Bulletin : గడిచిన రెండు వారాల్లో 6,334 సాంపుల్స్‌ సేకరించామని, గత వారంలో ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబులలో కలిపి మొత్తంగా 40 ఆర్టీపీసీఆర్‌ సాంపుల్స్‌(RTPCR Samples) తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. వాటి ఫలితాలు ఇంకా వెల్లడికావాల్సి ఉందని వెల్లడించారు. నెలాఖరులోగా, రోజుకు 4వేల టెస్టులు చేయడమే లక్ష్యంగా మంత్రి పనిచేయాలన్నారు.

పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సాంపుల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం సీడీఎఫ్​డీ, గాంధీ ఆస్పత్రికి పంపించాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి హెచ్​ఓడీలతో మీటింగ్‌ నిర్వహించి, సాయంత్రం 4గంటల లోపే రోజూ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని ఆదేశించారు. దాంతోపాటు గత 4ఏళ్లుగా వచ్చిన సీఎస్ఆర్ విరాళాల వివరాలు సేకరించి గణాంకాలు నమోదు చేయాలని మంత్రి, అధికారులకు సూచించారు.

న్యుమోనియా బాధితుల్లో కొవిడ్! - నిలోఫర్ ఆసుపత్రిలో 14 నెలల బాలుడిలో వైరస్​ నిర్ధరణ

కొవిడ్​ భయంతో మూడేళ్లుగా ఇంట్లోనే..! భర్తను కూడా రానివ్వకుండా కుమారుడితో..

Last Updated :Dec 23, 2023, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.