ETV Bharat / state

ప్రగతిభవన్​ ముట్టడి... అరెస్టులు, నిర్బంధాలతో కట్టడి...

author img

By

Published : Oct 21, 2019, 10:14 PM IST

భారీగా బలగాల మోహరింపు... గృహనిర్బంధాలు... అరెస్టులు... పోలీసుల కన్ను కప్పేందుకు నేతల యత్నాలు... ఖాకీల పరుగులు... ప్రగతిభవన్‌ ముట్టడి కార్యక్రమంలో కన్పించిన దృశ్యాలు. ఆద్యంతం ఉరుకులు పరుగులతో నాటకీయంగా నడిచిన ధర్నాలో... కాంగ్రెస్‌ నేతలను కట్టడి చేయడం పోలీసులకు కష్టతరమైంది. విడతల వారీగా వచ్చిన నేతలను ప్రగతిభవన్‌కు చేరుకోకుండా అడ్డుకునేందుకు నానా తంటాలు పడ్డారు.

CONGRESS PARTY PRAGATHI BHAVAN MUTTADI OVERALL STORY

ప్రగతిభవన్​ ముట్టడి... అరెస్టులు, నిర్బంధాలతో కట్టడి...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన ప్రగతి భవన్‌ ముట్టడి ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠగా సాగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రగతిభవన్‌ వద్దకు వెళ్లి తీరాలని నేతలు ముందే వ్యూహరచన చేసుకున్నారు. ఇటు పోలీసు శాఖ కూడా అప్రమత్తమై... హస్తం​ నేతల ఇళ్ల వద్ద అర్ధరాత్రి నుంచే బలగాలను మోహరించారు. ప్రగతి భవన్‌కు వచ్చే అన్ని దారులను మూసేసింది. చివరకు మెట్రో రైలు కూడా ఆ స్టేషన్‌లో ఆగకుండా చర్యలు తీసుకున్నారు.

ఆది నుంచే అరెస్టుల పర్వం...

ఉదయం మొదలైన కాంగ్రెస్‌ నేతల అరెస్టుల పరంపర మధ్యాహ్నం వరకు కొనసాగింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితో సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు బయటకు రాగానే అదుపులోకి తీసుకుని కొద్దిసేపు అటూ ఇటూ తిప్పి తిరిగి ఇంటిలోనే బంధించారు.

బైక్​ మీద వెళ్లినా... ఆటోలో వెళ్లినా అరెస్టే..!

ఎంపీ రేవంత్‌ రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచినా... పోలీసు వలయాన్ని చేధించుకుని ద్విచక్రవాహనంపై ప్రగతిభవన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ రేవంత్​ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కొద్దిసేపు బాహ్యవలయ రహదారిపై తిప్పి... చివరకు కామాటిపుర ఠాణాకు తరలించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సామాన్య పౌరుడి మాదిరి ఆటోలో ప్రగతి భవన్‌ వచ్చేందుకు యత్నించగా... పంజాగుట్ట వద్దకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీభవన్‌ నుంచి ప్రగతిభవన్‌కు బయలు దేరిన పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ అధికార ప్రతినిధులు సునీతారావ్‌, సతీష్‌ మాదిగ, నిజాంలను అరెస్ట్‌ చేశారు. మాజీ ఎంపీ అంజనికుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ రాముల్​నాయక్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తదితరులను ప్రగతిభవన్​ పరిసరాల్లో అరెస్ట్‌ చేశారు. ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌ నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ను అదుపులోకి తీసుకున్నారు.

గృహనిర్బంధాలు... ఇనుపకంచెలు...

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, జానా రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్థన్‌ రెడ్డి, మల్​రెడ్డి రంగారెడ్డి తదితరులను గృహనిర్బంధంలో ఉంచారు.
కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి నుంచి దాదాపు 50 మంది నేతలు ముట్టడికి ప్రారంభం కాగా... ఇనుప కంచెలు వేసి అడ్డుకున్నారు. పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినా... గృహనిర్బంధాల్లో ఉంచినా... కొందరు నాయకులు ప్రగతిభవన్‌ వరకు వచ్చి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు.

అరెస్టులతోనే విజయవంతం...

అన్ని దారులు మూసేసి ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయటంతోనే తమ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అభిప్రాయపడ్డారు. నేతలందరూ ప్రగతిభవన్‌ వద్దకు వెళ్లలేకపోయినా... తాము అనుకున్నట్లుగా భారీగా ప్రచారం జరిగి... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లైయిందని పేర్కొన్నారు.

ఇవీచూడండి: జీతాల చెల్లింపునకు నిధుల్లేవు: ఆర్టీసీ యాజమాన్యం

TG_Hyd_54_21_CONG_OVERALL_PKG_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ప్రగతి భవన్‌ ఓఎఫ్‌సీ నుంచి, గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి వచ్చిన విజువల్స్‌తోపాటు...వాట్సప్‌ గ్రూపులో వచ్చిన విజువల్స్‌ వాడుకోగలరు. Revantha reddy, visweswarareddy, mallu ravi bytes vaadukovachu ()ప్రగతిభవన్‌ ముట్టడి కార్యక్రమం ఆద్యంతం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలను పలువురిని ముందస్తుగా గృహనిర్బంధంలో ఉంచినా.... నిఘా వర్గాలు, శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్‌ విభాగాలు కలిసికట్టుగా చేస్తేకాని...కాంగ్రెస్‌ నేతలను కట్టడి చేయడం కష్టతరమైంది. ఎంపీ రేవంత్‌ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులు....ప్రగతిభవన్‌ వద్దకు చేరుకుని నానాహంగామా సృష్టించారు. విడతల వారీగా కాంగ్రెస్‌ నేతలు ప్రగతి భవన్‌కు చేరుకుంటుండడంతో వారిని అడ్డుకోడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. LOOK వాయిస్ఓవర్‌1: ఆర్టీసీ ఐకాస సమ్మెకు మద్దతుగా ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రగతిభవన్‌ వద్దకు వెళ్లి తీరాలని మాజీ మంత్రి షబీర్‌ అలీ ఇంట్లో నిన్న సాయంత్రం సమావేశమైన కాంగ్రెస్‌ నాయకులు వ్యూహ రచన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు శాఖ అప్రమత్తమైంది. ముట్టడి కార్యక్రమంలో ఎవరెవరు భాగస్వామ్యులవుతారన్న కోణంలో ఆరా తీసిన పోలీసులు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల ఇళ్ల వద్ద అర్ధరాత్రి నుంచే పోలీసులు మొహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ నేతలను ప్రగతి భవన్‌ వద్దకు రాకుండా చూడాలని భావించిన పోలీసు శాఖ కూడా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రగతి భవన్‌కు వచ్చే అన్ని దారులను మూసి వేసింది. చివరకు మెట్రో రైలును కూడా ఆ స్టేషన్‌లో ఆగనీకుండా చర్యలు తీసుకున్నారు. ఉదయం మొదలైన కాంగ్రెస్‌ నాయకుల అరెస్టుల పరంపర మధ్యాహ్నం వరకు కొనసాగింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితోసహా పలువురు నాయకులను అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు బయటకు రాగానే అదుపులోకి తీసుకుని కొద్దిసేపు అటూ ఇటూ తిప్పి తిరిగి ఇంటికే తీసుకొచ్చి వదిలి గృహ నిర్భందంలో ఉంచారు. పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచినా... పోలీసు వలయాన్ని చేధించుకుని ద్విచక్రవాహనంపై ప్రగతిభవన్‌ వద్దకు చేరుకున్నారు. ప్రగతిభవన్‌ వద్ద పోలీసులు అడ్డుకుని రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు కొద్ది సేపు నగరంలో అటూఇటూ తిప్పి....చివరకు కామాటిపుర పోలీసు స్టేషన్‌కు తరలించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సామాన్య పౌరుడి మాదిరి ఆటోలో ప్రగతి భవన్‌ వచ్చేందుకు యత్నించగా పంజాగుట్ట వద్దకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకుని గోశామహల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. గాంధీ భవన్‌ వద్ద నుంచి ప్రగతి భవన్‌కు బయలు దేరిన పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ అధికార ప్రతినిధులు సునీతారావ్‌, సతీష్‌ మాదిగ, నిజాంలను బయటకు రాగానే అరెస్ట్‌ చేశారు. మాజీ ఎంపీ అంజనికుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ రాములనాయక్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పీసీసీ అధికార ప్రతినిధులు ఇందిరాశోభన్‌, మానవతారాయ్‌ కాంగ్రెస్‌ నేతలు విక్రమ్‌గౌడ్‌, హర్షవర్దన్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డిలను ప్రగతి భవన్‌ పరిసరాల్లో అరెస్ట్‌ చేశారు. ఎంజీబీఎస్‌ బస్‌ స్టేషన్‌ నుంచి భోజనానికి వెళ్లుతుండగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావును అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మలక్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. వాయిస్ఓవర్‌2: మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, జానా రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణు వర్దన్‌ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులను గృహనిర్బంధంలో ఉంచారు. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇంట్లో మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్‌, చంద్రశేఖర్‌, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డిలతోపాటు దాదాపు 50 మంది కాంగ్రెస్‌ నాయకులు సమావేశమయ్యారు. వీరు ప్రగతి భవన్‌ బయలు దేరేందుకు యత్నించగా ఆయన ఇంటికి అన్ని వైపులా మొహరించిన పోలీసులు ఇనుపకంచెను వేసిరాకపోకలను అడ్డుకున్నారు. మీడియాను సైతం గుర్తింపుకార్డు చూపితేనే...అనుమతించారు. ఎంత పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినా... గృహనిర్బంధాల్లో ఉంచినా....కొందరు నాయకులు ప్రగతిభవన్‌ వరకు వచ్చి పోలీసులను ఉరుకులుపరుగులు పెట్టించారు. ఎటువైపు నుంచి ఎవరు వస్తారో అని పోలీసులు నానా హైరానా పడాల్సి వచ్చింది. అన్ని వైపులా మూసి వేసి ఎక్కడక్కడ అరెస్ట్‌ లు చేయడంతో తాము చేపట్టిన ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అభిప్రాయపడ్డారు. నేతలందరం ప్రగతిభవన్‌ వద్దకు వెల్లలేకపోయినా...తాము అనుకున్నట్లుగా భారీగా ప్రచారమైందని...ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లుయ్యిందని పలువురు నేతలు పేర్కన్నారు. END
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.