ETV Bharat / state

సీఎం పదవిలో ఉండే నైతిక హక్కు కేసీఆర్​కు లేదు: జీవన్​ రెడ్డి

author img

By

Published : Feb 8, 2021, 6:05 PM IST

Updated : Feb 8, 2021, 6:29 PM IST

సీఎం పదవి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా కేసీఆర్​కు​ పదవిలో ఉండే నైతిక హక్కు లేదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే ముఖ్యమంత్రి అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిపై చేసినా వ్యాఖ్యలపై రాష్ట్రపతి, గవర్నర్​కు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

congress mlc jeevan reddy  fire on cm kcr in gandhi bhavan
సీఎం పదవిలో నైతిక హక్కు లేదు : జీవన్​ రెడ్డి

రాజ్యంగబద్ధమైన సీఎం పదవిని కేసీఆర్​ అగౌరవ పరుస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే కేసీఆర్ సీఎం అయ్యారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్​కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని జీవన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిల్లీలో ఆలయ్​బలయ్​ అంటూ, రాష్ట్రంలో విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. గులాబీ కారు మోదీ నడుపుతున్నారో లేక కేసీఆర్ నడుపుతున్నారో చెప్పాలని జీవన్​ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్​ అవినీతిని బయట పెట్టేందుకు కేంద్రం ఎందుకు వెనకాడుతోంది. తెలంగాణను దోచుకునేందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం. సీఎంగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్​కు లేదు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్​పై రాష్ట్రపతి, గవర్నర్​కు ఫిర్యాదు చేస్తాం. గిరిజనులకు సంబంధించిన పోడు భూముల హక్కులపై పోరాడుతాం. - జీవన్​రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్సీ

ఇదీ చూడండి : మంథనిలో ఈటల.. ప్రొటోకాల్ పాటించలేదని శ్రీధర్ బాబు అలక..

Last Updated :Feb 8, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.