ETV Bharat / state

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి అద్దంకి దయాకర్​ క్షమాపణలు

author img

By

Published : Aug 13, 2022, 12:37 PM IST

Addanki Dayakar Apologized To Venkata Reddy ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మరోసారి క్షమాపణలు చెప్పారు. చండూరు బహిరంగసభలో వెంకట్​రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు.

అద్దంకి దయాకర్
అద్దంకి దయాకర్

Addanki Dayakar Apologized To Venkata Reddy: కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి క్షమాపణలు చెప్పారు. చండూరు సభలో చేసిన వ్యాఖ్యలు బాధపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఔన్నత్యంతో తన తరపున క్షమాపణలు చెప్పారని.. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు రాత పూర్వకంగా క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. బహిరంగ క్షమాపణ కూడా చెప్పినట్లు అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.

"చండూరు బహిరంగ సభలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి మరోసారి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్​లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ అంశంలో తన తరపున క్షమాపణలు చెప్పారు. నాయకులు అందరూ కలిసిపనిచేయాలని మరోసారి క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు రాత పూర్వకంగా వివరణ ఇచ్చాను. " - అద్దంకి దయాకర్ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి

మరోవైపు ఇదే అంశంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌ క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. చండూరు సభలో కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్‌ పరుష పదజాలంతో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకొవాలని రేవంత్​రెడ్డి సూచించారు.

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి అద్దంకి దయాకర్​ క్షమాపణలు

ఇవీ చదవండి: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రంథాలయాలు.. మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరం

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.