ETV Bharat / state

నెల రోజుల ప్రస్థానంపై రేవంత్ ట్వీట్ - 'మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా నా బాధ్యత నిర్వర్తిస్తా'

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 11:41 AM IST

Updated : Jan 7, 2024, 12:13 PM IST

CM Revanth Reddy Tweet Today
CM Revanth Reddy

CM Revanth Reddy Tweet on Congress One Month Ruling : ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన తన నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని సీఎం రేవంత్ ​రెడ్డి తెలిపారు. ప్రజలు రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా బాధ్యతను నిర్వర్తిస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy Tweet on Congress One Month Ruling : సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ ముందుకు సాగామన్నారు. అన్నగా నేనున్నానని ప్రజలకు హామీ ఇస్తూ, జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందంటూ రేవంత్​రెడ్డి వివరించారు.

  • సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది.

    సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.

    పేదల గొంతుక… pic.twitter.com/gkzpRy1zGT

    — Revanth Reddy (@revanth_anumula) January 7, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CM Revanth Reddy Tweet Today : పేదల గొంతుక వింటూ, యువత భవితకు దారులు వేస్తూ నడిచామని రేవంత్​రెడ్డి తెలిపారు. మహాలక్ష్మీల ముఖంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు కొనసాగుతోందన్నారు. పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీఠ వేస్తామన్న ముఖ్యమంత్రి, పెట్టుబడులకు కట్టుబడి ఉంటామని మరోమారు చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పారు. నెలరోజుల పాలన నిజాయతీగా సాగిందన్నారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా మరింత బాధ్యతగా ముందుకు సాగుతానని రేవంత్​రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ముఖ్యమంత్రిగా రేవంత్​రెడ్డి నెల రోజుల ప్రస్థానం సాగిందిలా :

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్​రెడ్డి సర్కార్ నెల రోజుల పాలన పూర్తి చేసుకుంది. మార్పు అంటే ఇదీ అని రేవంత్​ నిరూపించుకున్నారు. వస్తూనే ప్రజాపాలన అంటే ఏంటో చూపించారు. ప్రభుత్వానికి - పబ్లిక్ మధ్య అంతరాలన్నీ తొలగించారు. మేమున్నామనే భరోసా కల్పించారు. గత పదేళ్లుగా ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం మిస్ అయ్యారో, వాటిని నెల రోజుల్లోనే అందించారు. జనానికి, సర్కార్​కు మధ్య ఉన్న బారియర్స్​ను తొలగించి స్వేచ్ఛను కల్పించారు.

పాలనలో దూకుడు, ఎక్కడ తగ్గాలో తెలుసు : సింపుల్​గా, స్మూత్​గా, ఫాస్ట్​గా ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో ప్రజలకు మరింత దగ్గర ఎలా అవ్వాలో తెలిసిన నేత ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి. అందుకే కేవలం నెల రోజుల పాలనలోనే తన మార్క్ ఏంటో చూపించుకోగలిగారు. పాలకులం కాదు, సేవకులం అంటూ ప్రమాణ స్వీకారం రోజే సరికొత్తగా ప్రజల్ని ఆకట్టుకున్నారు. సీనియర్ మంత్రులను కలుపుకొని వెళ్తూ, ఆరు గ్యారెంటీల అమలుపై దూకుడు చూపుతూ పాలనలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో పదేళ్లుగా గత ప్రభుత్వం చేసిన తప్పులను రిపీట్ కాకుండా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రతి పైసాను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

ఎన్నికల్లో ఓడినా బీఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదు - వారి విమర్శలను దీటుగా తిప్పి కొట్టాలి : సీఎం రేవంత్​

వస్తూనే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఖజానాను ఖాళీ చేసిన పరిస్థితిని తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా వివరించడంతో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసింది. అయితే వీటిని తిప్పి కొడుతూ, గ్యారెంటీ హామీలు వంద రోజుల్లో కచ్చితంగా అమలు అవుతాయన్న భరోసా ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ సఫలమైంది.

రూట్ మారింది, స్పీడ్ పెరిగింది : ఓవైపు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూనే, ఇంకోవైపు ప్రగతిభవన్ గడీ గోడలు బద్దలు కొట్టించారు రేవంత్. ప్రజా పాలనకు, స్వేచ్ఛకు అదొక సూచికగా మార్చేశారనే చెప్పాలి. అప్పటి వరకు పెద్ద గోడలు, ఫెన్సింగ్​లు, ఇనుప కంచెలతో ఉన్న ప్రగతిభవన్​ను ప్రజలకు అంకితం చేశారు. దానిని కాస్తా జ్యోతిబా పూలే ప్రజాభవన్​గా మార్చేశారు. ఇక అక్కడి నుంచి మొదలు రూట్ మారింది. స్పీడ్ పెరిగింది. తొలి సంతకం ఆరు గ్యారెంటీల అమలు, అలాగే గతంలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇచ్చారు.

హైదరాబాద్​ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్​ - మూసీ నది అభివృద్ధే ప్రధానం

అలసిపోయిన ప్రజలకు ఉపశమనం : ఇన్నాళ్లూ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన జనానికి ఈ చర్యలు చాలా ఉపశమనం అందించాయి. మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో ఉన్నామన్న విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ రెండో రోజే క్లారిటీ ఇచ్చింది. కారణం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆలస్యం చేయకుండా డిసెంబర్ 9న సోనియా జన్మదినం సందర్భంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు చాలా కీలకంగా మారింది. ప్రతి మహిళ జీవితాంతం గుర్తుంచుకునే గ్యారంటీ ఇది. బస్సు ఎక్కితే రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే వెసులుబాటు రేవంత్​ సర్కార్ కల్పించింది. కాగా ప్రతి రోజూ 27 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రోజూ దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టిక్కెట్లను ఆర్టీసీ జారీ చేస్తోంది.

మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అలా పగ్గాలు చేపట్టగానే, యాక్షన్​లోకి దిగారు. ఎక్కడా ఆలస్యం చేయలేదనే చెప్పాలి. సూటిగా, స్పీడ్​గా పని చేస్తూ వెళ్లారు. పదేళ్లలో తిష్టవేసిన సమస్యలపై ఫోకస్ పెట్టారు. నిద్రాణలో ఉన్న వివిధ శాఖలను తట్టి లేపారు. దుమ్ము పట్టిన పెండింగ్ ఫైళ్లకు బూజు దులిపారు. అధికారులను సైతం అలర్ట్ చేశారు. శాఖల వారీగా రోజూ సమీక్షలతో రేవంత్ ​రెడ్డి ఈ నెల రోజులు క్షణం తీరిక లేకుండా పని చేశారు. ప్రజాభవన్ గేట్లు ఖుల్లా చేసినట్లుగానే, సెక్రటేరియట్ ద్వారాలు కూడా అందరికీ తెరిచేశారు. ఇన్ని రోజుల నిర్బంధానికి చరమగీతం పాడారు. నిజానికి నెల రోజుల్లోనే అందరినీ సెట్ రైట్ చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

నీటిపారుదల రంగంపై సర్కార్ ఫోకస్ - నేడు సీఎం రేవంత్ సమీక్ష

Last Updated :Jan 7, 2024, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.