ETV Bharat / state

Hospitals in Hyderabad: మరో 3 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు.. భూమిపూజ చేయనున్న కేసీఆర్‌

author img

By

Published : Apr 24, 2022, 10:56 PM IST

Hospitals in Hyderabad:హైదరాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. టిమ్స్ మాదిరిగా అందుబాటులోకి మరో 3 ఆస్పత్రులు రానున్నాయి. ఈనెల 26న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

hospitals in Hyderabad
సీఎం కేసీఆర్

Hospitals in Hyderabad: హైదరాబాద్‌లో నలువైపుల నిర్మించనున్న మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఈనెల 26న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే టిమ్స్ మాదిరిగా మరో 3 ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. అల్వాల్, ఎల్బీ నగర్, సనత్‌నగర్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఆస్పత్రులకు అనుబంధంగా నర్సింగ్, పారా మెడికల్ విద్యకు సైతం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు ఆస్పత్రులకు ఇప్పటికే స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్​నగర్‌లలో 2 వేల 679 కోట్లతో ఆస్పత్రుల నిర్మాణం చేసేందుకు వైద్యారోగ్యశాఖ పరిపాలనపరమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్బీనగర్‌ ఆస్పత్రికి రూ.900కోట్లు, సనత్ నగర్‌ ఆసుపత్రికి రూ.882 కోట్లు, అల్వాల్ ఆస్పత్రికి రూ.897 కోట్లు నిధులు కేటాయించింది.

ఇవీ చూడండి: 'ముస్లింల అభ్యున్నతికి అహర్నిషలు పాటుపడుతోన్న రాష్ట్రం తెలంగాణ..'

డ్రాగన్​కు భారత్ ఝలక్​.. టూరిస్ట్ వీసాలు సస్పెండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.