ETV Bharat / state

రైస్​ మిల్లర్లకు అండగా ఉంటాం: కేసీఆర్​

author img

By

Published : Mar 30, 2020, 7:02 PM IST

Updated : Mar 30, 2020, 8:13 PM IST

ప్రపంచమంతా కరవొచ్చినా తెలంగాణలో రాదని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఇవాళ ప్రగతి భవన్​లో రైస్​ మిల్లర్ల అసోసియేషన్​ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమై... ధాన్యం సేకరణ తదితర అంశాలపై చర్చించారు.

CM KCR review with rice millers association leaders
CM KCR review with rice millers association leaders

రైస్​ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. ఇవాళ ప్రగతి భవన్​లో వరి సాగు, ధాన్యం దిగుబడులు తదితర అంశాలపై అధికారులు, రైస్​ మిల్లర్ల అసోసియేషన్​ నేతలో ముఖ్యమంత్రి చర్చించారు. రైస్​ మిల్లర్లతో చర్చలు జరిపి సమగ్ర ధాన్యం, బియ్యం విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఈసారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. కోటి లక్షల టన్నులకుపైగా ధాన్యం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతుందని తెలిపారు.

మిల్లులు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని సీఎం సూచించారు. రైస్‌ మిల్లర్లకు అధికారుల నుంచి వేధింపులు ఉండవని సీఎం స్పష్టం చేశారు. రైస్‌ మిల్లులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా గుర్తిస్తామన్నారు. అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గోదాముల సంఖ్యను పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

Last Updated : Mar 30, 2020, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.