'త్వరలోనే దేశంలో ఓ సంచలనం జరగబోతోంది.. అది మీరంతా చూస్తారు..'

author img

By

Published : May 21, 2022, 6:59 PM IST

Updated : May 21, 2022, 8:19 PM IST

దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది.. జరిగి తీరుతుంది: సీఎం కేసీఆర్​

18:45 May 21

దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది.. జరిగి తీరుతుంది: సీఎం కేసీఆర్​

కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దింది: సీఎం కేసీఆర్

CM KCR Sensational Comments: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​.. ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌, కేజ్రీవాల్​లతో చర్చలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "వ్యాపారస్థులు కలుసుకుంటే వ్యాపారం గురించి మాట్లాడుకుంటారు. రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుతాం. అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ తో రాజకీయాలు మాట్లాడడం చాలా సహజం. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది, జరిగి తీరుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరూ చూస్తారు." అంటూ సీఎం కేసీఆర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి దిల్లీలోని మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్​ పరిశీలించారు. కేజ్రీవాల్‌ స్వయంగా కేసీఆర్‌కు సర్వోదయ పాఠశాలను చూపించారు. అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సదుపాయాలను కేసీఆర్‌కు వివరించారు. పాఠశాలలో అధునాతనంగా అందుతున్న వసతుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు సంబంధించిన వీడియోలను కేసీఆర్​ బృందం వీక్షించిన కేసీఆర్​.​.. విద్యారంగంలో దిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని కొనియాడారు.

కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దింది. దిల్లీ పాఠశాలల గురించి గతంలో టీవీల్లో చూశాను. ఇప్పుడు ప్రత్యక్ష్యంగా చూశాను. కేజ్రీవాల్‌ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారు. తెలంగాణ ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులను దిల్లీ పాఠశాలలకు పంపిస్తాం. దిల్లీ బోధనా విధానాలను అధ్యయనం చేయాలని చెప్తాం. దిల్లీ బోధనా విధానాలు దేశం మొత్తానికి ఆదర్శనీయం. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య, మార్కులు.. ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన శిక్షణ భేష్. భారత్​లో మరెక్కడా ఇటువంటి విద్యా విధానం లేదు. దిల్లీలో పిల్లలను చదివించటంలో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. దిల్లీ ప్రజలు అదృష్టవంతులు... దిల్లీ లాంటి విధానాలపై చర్చించాలి. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా... జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బావుంది. ఇంత పెద్ద జనసంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరం. తెలంగాణలో కూడా ఈ విధానం అమలు చేస్తాం. మా రాష్ట్రం నుంచి త్వరలో అధికారుల బృందాన్ని పంపించి సమన్వయం చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం ఏకపక్షంగా ఉండరాదు. ప్రజాస్వామ్య దేశంలో చర్చలు, సంప్రదింపులు ఉండాలి. విద్యా విధానం దేశానికి అవసరమే... కానీ, ఒకరు రూపొందించి అందర్నీ అమలు చేయాలనడం సరికాదు. కేంద్రం ఏ కొత్త విధానమైనా అయినా తీసుకురావొచ్చు. ఆ విధానం తీసుకువచ్చే ముందు కేంద్రం, అన్ని రాష్ట్రాలతో చర్చించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు." -సీఎం కేసీఆర్

"తెలంగాణ ముఖ్యమంత్రి దిల్లీ పాఠశాలలను చూడటానికి వచ్చారు. మాకు చాలా గౌరవంగా ఉంది. స్కూల్ మొత్తం చూపించాం. వారు ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు విద్యాశాఖపై చాలా ఆసక్తి ఉంది". - అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం

అంతకుముందు.. దిల్లీలోని తన నివాసంలో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో కేసీఆర్​ భేటీ అయ్యారు. రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు.. దేశంలోని తాజా పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు, ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

  • ఆదివారం(మే 22) మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్లనున్న కేసీఆర్.. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్​లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
  • మే 26వ తేదీ ఉదయం బెంగళూరులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు.
  • మే 27వ తేదీన బెంగుళూరు నుంచి సీఎం కేసీఆర్ రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళ్తారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం సాయిబాబా దర్శనం కోసం సీఎం కెసిఆర్ షిర్డీ వెళతారు. అక్కడ నుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్​కు చేరుకుంటారు.
  • మే 29 లేదా 30వ తేదీన బంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోనున్నారు.

ఇవీ చూడండి..

అఖిలేశ్​తో కేసీఆర్ భేటీ.. రెండు గంటలకు పైగా సాగిన చర్చ..

CM KCR National Tour: హస్తినలో సీఎం కేసీఆర్​.. జాతీయస్థాయి పర్యటన షురూ..

Last Updated :May 21, 2022, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.