ETV Bharat / state

ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం: కేసీఆర్

author img

By

Published : Feb 5, 2023, 3:54 PM IST

Updated : Feb 5, 2023, 4:05 PM IST

KCR
KCR

KCR Fires on BJP and Congress: బీజేపీ, కాంగ్రెస్​లపై కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్‌.. 16 ఏళ్లు బీజేపీ పాలించాయి.. ఇవి ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయని మండిపడ్డారు. ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటమని ఆయన స్పష్టం చేశారు.

ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం: కేసీఆర్

KCR Fires on BJP and Congress: టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మార్చాక మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన తొలి బహిరంగ సభలో కేసీఆర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్‌, పూలే వంటి మహానీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది అని సభలో పేర్కొన్నారు. దేశ పరిస్థితులు చూసిన తర్వాత.. వాటిని మార్చేందుకు టీఆర్ఎస్​ను.. బీఆర్ఎస్​గా మార్చామని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత మీరంతా ఇళ్లకు వెళ్లి చర్చ చేయండని సూచించారు. మహారాష్ట్ర నాందేడ్​లో నిర్వహించిన బీఆర్ఎస్​ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో భారీ మార్పు తేవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది.. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు.. కానీ ఆ మేరకు మార్పులు రాలేదని స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కనీసం తాగునీరు, విద్యుత్‌ ఇవ్వలేదని ఆరోపించారు. మహారాష్ట్రలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదని అన్నారు. అందుకే అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌.. నినాదంతో బీఆర్ఎస్​ వచ్చిందని వివరించారు.

ఎన్నాళ్లో ఎదురు చూశాం.. ఇక ఇప్పుడు సమయం వచ్చింది: భారత్‌ బుద్దిజీవుల దేశమని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నాళ్లో ఎదురు చూశాం.. ఇక ఇప్పుడు సమయం వచ్చిందని వివరించారు. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు.. ప్రజలు గెలవాలి, రైతులు గెలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భారత్‌లో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ.. ప్రజలు వంచనకు గురవుతున్నారని మండిపడ్డారు. భారత్‌ పేద దేశం ఎంతమాత్రమూ కాదని.. భారత్.. అమెరికా కంటే ధనవంతమైన దేశమని కేసీఆర్ వెల్లడించారు.

కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పరం అవినీతి ఆరోపణలు: భారత్‌లో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి ఇంకొకటి లేదని కేసీఆర్ పేర్కొన్నారు. దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్‌.. 16 ఏళ్లు బీజేపీ పాలించాయి.. ఇవి ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయని ఆరోపించారు. నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావని.. కాంగ్రెస్, బీజేపీ తిట్టుకుంటాయని విమర్శించారు. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు.. చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు.

ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం: దేశమంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. నాందేడ్‌లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లెక్కపెట్టారా? అని అన్నారు. ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటమని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్న దేశంలో ఉందని వివరించారు. ఇంత విశాల భారత్‌లో కనీసం 2,000 టీఎంసీల రిజర్వాయర్‌ ఎందుకు లేదని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించటం లేదని తెలిపారు.

ట్రైబ్యునళ్ల పేరుతో సంవత్సరాల కొద్దీ జలవివాదాలు పెండింగ్‌లో పెడతారు: ట్రైబ్యునళ్ల పేరుతో సంవత్సరాల కొద్దీ జలవివాదాలు పెండింగ్‌లో పెడతారని కేసీఆర్ అన్నారు. ట్రైబ్యునళ్ల పేరుతో ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా తిప్పుతారని ఆరోపించారు. చిత్తశుద్ధితో కృషి చేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. గట్టిగా అనుకుంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వొచ్చని కేసీఆర్ వెల్లడించారు.

"54 ఏళ్లు కాంగ్రెస్‌.. 16 ఏళ్లు బీజేపీ పాలించాయి.. ఇవి ఏం సాధించాయి. కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావని కాంగ్రెస్, బీజేపీ తిట్టుకుంటాయి. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు.. చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయి. దేశమంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయి. ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం." - కేసీఆర్, సీఎం

ఇవీ చదవండి: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. వార్షిక బడ్జెట్‌కు కేబినెట్​ ఆమోదం

దేశంలో తొలి 'వన్​ హెల్త్​ సెంటర్'​ ఏర్పాటు.. ఫారిన్ వర్సిటీతో భారత్ బయోటెక్​ కీలక ఒప్పందం

Last Updated :Feb 5, 2023, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.