ETV Bharat / state

పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత : సీఎం జగన్

author img

By

Published : Nov 26, 2020, 4:04 PM IST

పారిశ్రామిక కారిడార్లు, పోర్టులపై ఏపీ సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలిప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖకు పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరాలకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు.

jagan
పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత : సీఎం జగన్

పారిశ్రామిక కారిడార్లు, పోర్టులపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం.. అధికారులను ఆదేశించారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు.

కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖకు పైపులైన్‌ ద్వారా తాగునీటి సరఫరాకు డీఆపీఆర్‌ సిద్ధం చేయాలన్నారు. మూడు పనులకు సంక్రాంతిలో శంకుస్థాపనకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు.

ఇదీ చదవండి : ఎన్నికలకు సంబంధం లేని అంశాలు ప్రస్తావిస్తున్నారు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.