ETV Bharat / state

మూడు సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను: కార్తీక్‌

author img

By

Published : Aug 5, 2020, 5:15 AM IST

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన సత్యసాయి కార్తీక్‌ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో 103వ ర్యాంకు సాధించారు. మనతో మనమే పోటీ పడుతూ.. లక్ష్యాన్ని సాధించాలంటున్న సత్యసాయి కార్తీక్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

civils-ranker-karthik-interview
మూడు సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను: కార్తీక్‌

మూడు సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను: కార్తీక్‌

మా కుటుంబంలో నేనే ఫస్ట్

నాన్న ఎస్​బీఐ ఉద్యోగి. అమ్మ శారీ బొటిక్ నిర్వహిస్తారు. సోదరి ఓ అంకుర సంస్థ నడుపుతున్నారు. నేను లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాను. గోకరాజు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాను. డెల్లాయిట్​లో ఆరు నెలల ఉద్యోగం చేశాను. మా కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరూ సివిల్ సర్వీసుల్లో లేరు. మొదటగా సాధించినందుకు సంతోషంగా ఉంది.

క్రికెటర్ అవుదామనుకున్నా

క్రికెట్ అంటే చాలా ఇష్టం. అండర్ 19లో హైదరాబాద్ తరఫున ఆడాను. క్రికెటర్ కాకపోతే సివిల్స్ రాయాలని నాన్న ప్రోత్సహించారు. మొదటి సారి క్రికెట్ కొనసాగిస్తూనే సివిల్స్ రాశాను. ఫెయిలయ్యాను. దీంతో క్రికెట్ వదిలిపెట్టి పూర్తిగా సివిల్స్​కు కేటాయించాను. మూడు సార్లు ఫెయిలయ్యాను. అయినా నిరుత్సాహ పడలేదు. నువ్వు చేయగలవంటూ అమ్మ, నాన్న, సిస్టర్, కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాలలత ప్రోత్సహించారు.

నిరంతరం ప్రాక్టీస్ చేశాను

ప్రిలిమ్స్​లో చదవడం, సమస్య పరిష్కారం కనుక్కోవడం, అసెస్​మెంట్ ముుఖ్యం. మెయిన్స్​కు సమయంలోగా సమాధానం రాయడం కావాలి. ఇంటర్వ్యూలో ఎక్కువగా మాట్లాడాలి. నిరంతరం ప్రాక్టీస్ చేశాను. కరోనా పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాను. మొబైల్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ జాగ్రత్తగా వాడుకోవడం చాలా అవసరం.

కచ్చితమైన ప్రణాళిక అవసరం

సివిల్స్ అనగానే ఇతరులతో పోటీగా భావిస్తారు. కానీ మనతో మనం పోటీ పడాలి. మన బలహీనతలను తెలుసుకోవాలి. నేనైతే కచ్చితంగా ఇన్ని గంటలు చదవాలని ఏమీ పెట్టుకోలేదు. కచ్చితమైన ప్రణాళిక అవసరం.

ఇవీ చూడండి: సివిల్స్​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు.. 36 మంది ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.