ETV Bharat / state

చిరంజీవి 'ది లెజెండ్‌' పుస్తకాన్ని ఆవిష్కరించిన హీరో రాంచరణ్‌

author img

By

Published : Mar 1, 2020, 11:19 PM IST

చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫ్యాన్​ ఫాలోయింగ్​ తెలుగు హీరోలకు ఎవ్వరికీ లేదనే చెప్పాలి. సాధారణ కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో ఎదిగి మెగాస్టార్​ అయ్యారు. అటువంటి నటుడిపై 'ది లెజెండ్‌' పేరుతో సీనియర్​ జర్నలిస్టు వినాయకరావు రాసిన పుస్తకంను హీరో రామ్​ చరణ్​ ఆవిష్కరించారు.

Chiranjeevi book hero Ram Charan released at hyderabad
చిరంజీవి 'ది లెజెండ్‌' పుస్తకాన్ని ఆవిష్కరించిన హీరో రాంచరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి జీవిత విశేషాలపై రాసిన 'ది లెజెండ్‌' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ సినీ పాత్రికేయులు వినాయకరావు రచించిన ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్‌లోని ద పార్క్‌ హయత్‌ హోటల్‌లో నిర్వహించారు. చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ ఆ పుస్తకాన్ని అవిష్కరించారు.

చిరంజీవి 'ది లెజెండ్‌' పుస్తకాన్ని ఆవిష్కరించిన హీరో రాంచరణ్‌

ఈ కార్యక్రమానికి చిరంజీవి తనయుడు, సినీ హీరో రాంచరణ్‌తోపాటు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్​, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకుడు బి. గోపాల్‌, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్‌, నిర్మాత, రాజకీయ నేత సుబ్బిరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిరంజీవి అభిమానులను ఘనంగా సత్కారించారు. చిరంజీవి సినీ చరిత్ర, ఖైదీ 150కి ముందు, ఆ తరువాత సాగిందని హీరో రాంచరణ్‌ అన్నారు. చిరంజీవి నుంచి ఎంతో నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి : పాపను బలిగొన్న పట్టణ ప్రగతి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.