ETV Bharat / state

Chief Election Officer on Assembly Elections 2023 : 'డబుల్ ఓట్ల తొలగింపు.. ఓటింగ్ శాతం పెంచడమే మా ప్రధాన లక్ష్యాలు'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 10:59 AM IST

Chief Election Officer Vikasraj on Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు షురూ చేసింది. ఎన్నికల శిక్షణలో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. ఈ ఏడాది ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్​రాజ్ తెలిపారు. అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

Telangana Assembly Elections 2023
Chief Election Officer on Assembly Elections 2023

Chief Election Officer Vikasraj on Telangana Assembly Elections 2023 : రానున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌(State Chief Election Officer Vikasraj) తెలిపారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తయిందని.. జిల్లాల్లోనూ సిబ్బందికి శిక్షణలు ప్రారంభించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా(Telangana Voters List) ప్రత్యేక సవరణకు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.

ఇందులో మార్పులు, చేర్పుల కోసమే 9 లక్షలకు పైగా అర్జీలు అందాయని తెలిపారు. ఇలాంటివి గతంలో 1-2 లక్షలు కూడా వచ్చేవి కాదన్నారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు పది రోజుల ముందువరకు వచ్చిన ఓటరు దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ అధికారులు పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యంలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై సెప్టెంబరు 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని.. అక్టోబరు 4వ తేదీన తుది ఓటర్ల జాబితా(Final Voters List) ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై ఆయన ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

Voter Registration Training Program : 'ఒకే కుటుంబ సభ్యుల ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం లో ఉండే విధంగా చూడాలి.. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి'

EC Focus on Telangana Assembly Elections 2023 : ఈ దఫా పెద్ద సంఖ్యలో తొలితరం ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్‌ కేంద్రాలు కూడా భారీగా పెరిగాయన్నారు. ప్రతి కేంద్రంలో 1,500 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే పరిస్థితి రాకుండా విస్తృత కసరత్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆగస్టు 26, 27 తేదీల్లో నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. సెప్టెంబరు 2, 3 తేదీల్లోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు.

TS Assembly Elections 2023: 'షెడ్యూల్‌ ప్రకారం తెలంగాణలో అప్పుడే ఎన్నికలు!'

ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లు తొలగిస్తాం : రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఒకే ఇంటి నంబరులో ఆరు అంతకు మించి ఓటర్లు ఉన్నచోట గత మేలో ఇంటింటి సర్వే నిర్వహించామని వికాస్​రాజ్​ తెలిపారు. సుమారు 7.5 లక్షల నివాసాల పరిధిలోని 75 లక్షల ఓటర్ల వివరాలను పరిశీలించామన్నారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఆ చిరునామాల్లో లేరని చెప్పారు. వారిలో సింహభాగం.. మారిన కొత్త ప్రాంతాల్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోందని వివరించారు. చిరునామాలో లేని ఓటర్లకు నోటీసులు జారీచేస్తామని తెలిపారు. వాటిపై 15 రోజుల్లో ఆ ఓటర్లు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తర్వాత పోలింగ్‌ కేంద్రం స్థాయి అధికారితో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి, ఓటరు కోరుకున్న ప్రాంతంలో ఓటు ఉంచి మరో ప్రాంతంలోనిది తొలగిస్తామని వెల్లడించారు.

పోలింగ్‌ శాతం తగ్గుదలపై అధ్యయనం : గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతం బాగా తగ్గిందని వికాస్​రాజ్ పేర్కొన్నారు. అందుకు కారణాలపై సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌(Center for Economics and Social Science) అధ్యయనం చేసిందన్నారు. ఆ నివేదికలో పేర్కొన్న కారణాలను విశ్లేషించి, ఓటింగ్‌ పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు.

Telangana CEO Vikas raj interview: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న ఈసీ

TS Assembly Elections 2023 : 'ఈ దఫా ఎన్నికల్లో అన్నీ కొత్త ఈవీఎంలే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.