ETV Bharat / state

KISHAN REDDY COMMENTS ON KCR: 'ధర్నాచౌక్​​లో కేసీఆర్​ ధర్నా రైతుల కోసం కాదు'

author img

By

Published : Nov 27, 2021, 6:16 PM IST

Updated : Nov 27, 2021, 10:12 PM IST

KISHAN REDDY COMMENTS ON KCR: 'ఇందిరాపార్క్​లో కేసీఆర్​ ధర్నా రైతుల కోసం కాదు'
KISHAN REDDY COMMENTS ON KCR: 'ఇందిరాపార్క్​లో కేసీఆర్​ ధర్నా రైతుల కోసం కాదు'

KISHAN REDDY COMMENTS ON KCR: ధర్నాచౌక్​​లో కేసీఆర్​ చేసిన ధర్నా రైతుల కోసం కాదని... లేని సమస్యను సృష్టించి ధర్నా చేశారని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఫలితం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ధాన్యం వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం చేసుకున్న ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు.

'ధర్నాచౌక్​​లో కేసీఆర్​ ధర్నా రైతుల కోసం కాదు'

KISHAN REDDY COMMENTS ON KCR: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో లిఖిత పూర్వక ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ విషయాన్ని వదిలిపెట్టి కేసీఆర్ కుటుంబం... కేంద్రంపై అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

బాయిల్డ్ రైస్​ తినేవారు తక్కువ

హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ప్రగతిభవన్‌ పూర్తిగా తెరాస కార్యాలయంగా మారిపోయిందని మండిపడ్డారు. ఎంత అణిచివేస్తే అంతా తిరగబడుతామని అక్కడి ప్రజలు నిరూపించారని కేంద్రమంత్రి తెలిపారు. హుజూరాబాద్ తీర్పును మళ్లించడం కోసం వరిధాన్యం కొనుగోలుపై తెరాస కొత్త పల్లవి ఎత్తుకుందని ఎద్దేవా చేశారు. లేని సమస్యలను సృష్టించి ధర్నాచౌక్​ వద్ద కేసీఆర్ ధర్నా చేపట్టారని విమర్శించారు. పంట బీమాపథకం తెలంగాణలో అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఎందుకు తెరవడంలేదని ప్రశ్నించారు. దేశంలో బాయిల్డ్‌ రైస్​ తినే ప్రజల సంఖ్య తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. 2014లో ధాన్యం సేకరణ కోసం కేంద్రం రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం ధాన్యం సేకరణ కోసం కేంద్రం 26,600 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి వివరించారు.

శనిగలు ఎక్కడికి పోయాయి..

తెలంగాణలో శనిగలు పంపిణీ చేయలేదు అవి ఎక్కడికి పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని కిషన్​రెడ్డి డిమాండ్ చేశారు. దళిత బంధును ఆపాలని ఎన్నికల కమిషన్‌కు భాజపా ఫిర్యాదు చేసిందని తప్పుడు ప్రచారం చేశారని... ఎన్నికలు ముగిశాయి ఇప్పుడెందుకు అమలు చేయడంలేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత వేగంగా మార్పులు వస్తున్నాయని చెప్పారు. అసలైన కవులు కళాకారులు తెరాస పార్టీలో లేరని తెలిపారు. కవులు కళాకారులపై తెరాస ప్రభుత్వం నిర్బంధం విధిస్తోందని విమర్శించారు.

'ఎంత నిర్బంధం పెడితే ప్రజలు అంత తిరుగుబాటు చేస్తారు. హుజూరాబాద్‌ ఎన్నికలో ఇదే నిరూపితమైంది. హుజూరాబాద్ ఫలితాన్ని తారుమారు చేయాలని తెరాస చూసింది. హుజూరాబాద్ ఫలితం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ధాన్యం వివాదం తీసుకొచ్చారు. దేశంలో బాయిల్డ్‌ రైస్​ తినే ప్రజల సంఖ్య తగ్గిపోయింది. 2014లో ధాన్యం సేకరణ కోసం కేంద్రం రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం ధాన్యం సేకరణ కోసం కేంద్రం రూ.26,600 కోట్లు ఖర్చు చేస్తోంది.' -కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

ఇదీ చదవండి:

Bandi Sanjay Comments on CM KCR : 'సీఎం కుర్చీ కోసం కొట్లాట మొదలైంది'

Last Updated :Nov 27, 2021, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.