ETV Bharat / city

Bandi Sanjay Comments on CM KCR : 'సీఎం కుర్చీ కోసం కొట్లాట మొదలైంది'

author img

By

Published : Nov 27, 2021, 12:20 PM IST

Bandi Sanjay Comments on CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్లారో ఎవరికీ అర్థం కాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సొంత పనుల కోసం దిల్లీ వెళ్లి.. కేంద్రాన్ని అప్రతిష్ఠ పాలు చేశారని మండిపడ్డారు. ప్రగతిభవన్​(pragathi bhavan)లో నాలుగు స్తంభాలాట మొదలైందని.. సీఎం కుర్చీ కోసం కొట్లాట షురూ అయిందని తెలిపారు. 2023లో అధికారంలోకి వచ్చేది భాజపానేనని.. తాము అధికారంలోకి వస్తే.. అర్హులందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

బండి సంజయ్, కేసీఆర్​పై బండి సంజయ్ ఫైర్, కేసీఆర్​పై బండి విమర్శలు, bandi sanjay, bandi sanjay fires on kcr, bandi comments on kcr
బండి సంజయ్

సీఎం కుర్చీ కోసం కొట్లాట మొదలైంది : బండి సంజయ్

Bandi Sanjay Comments on CM KCR: ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపాను అప్రతిష్ఠ పాలు చేసేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారన్న సంజయ్.. సీఎం పోకడలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

"తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. రక్తం ధారబోసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ప్రగతి భవన్​లో నాలుగు స్తంభాలాట మొదలైంది. సీఎంను చేయాలని కేసీఆర్​ను.. కుమారుడు, కుమార్తె, అల్లుడు అడుగుతున్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా చేస్తున్న పోరాటంతో అనేక మార్పులు సంభవించాయి. తెలంగాణ రైతాంగాన్ని ఏ విధంగా అదుకున్నారో కేసీఆర్ చెప్పాలి. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య సిబ్బందిని తొలగించారు. ఎస్సీ ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీలు విస్మరించి.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కేసీఆర్ దారి మళ్లించారు. మతపరమైన రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. 80శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారితే.. తెరాస(BJP state executive meeting 2021), మజ్లిస్ కుట్రలను భగ్నం చేయవచ్చు."

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Bandi Sanjay on KCR Delhi Tour: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం దెబ్బతిందని బండి సంజయ్ విమర్శించారు. ఎంబీసీ పేరుతో బీసీ కులాల మధ్య కేసీఆర్ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో భాజపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. డిసెంబర్ 17 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తామని తెలిపారు.

Bandi Sanjay Speech Latest: భాజపా అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా.... ఉచిత విద్య, వైద్యం ఇప్పించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టానని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో కేసీఆర్​కు భయం పట్టుకుందని చెప్పారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను డిసెంబర్ 17 నుంచి ప్రారంభిస్తానని వెల్లడించారు.

ఇదీ చదవండి :

BJP state executive meeting: రాష్ట్రంలో భాజపాను మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసి సమష్టిగా కృషిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలను... నాయకులు గుర్తించి తగిన గుర్తింపు ఇవ్వాలని సూచించారు. బండ్లగూడ మహవీర్​ ఇంజినీరింగ్​ కళాశాలలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఆయన ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.