ETV Bharat / state

రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్

author img

By

Published : Nov 10, 2022, 11:37 AM IST

Pending Issues Related to the State: రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్​లో ఉన్న అంశాలపై కేంద్రప్రభుత్వం సమీక్షను నిర్వహించనుంది. దీనిని దిల్లీ నుంచి రాష్ట్ర అధికారులతో దృశ్యోమాధ్యమం ద్వారా సమీక్షిస్తారు. ఇందులో పోర్టల్​లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిన, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖలు పొందుపరిచిన అంశాలు ఉన్నాయి.

Pending Issues Related to the State
Pending Issues Related to the State

Pending Issues Related to the State: రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఈ నెల 16వ తేదీన కేంద్రప్రభుత్వం సమీక్షించనుంది. కేంద్ర, రాష్ట్ర సమన్వయానికి సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు. ఈ సమీక్ష పోర్టల్​లో పొందుపరిచిన అంశాలపై కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ సమీక్ష నిర్వహించనుంది. దిల్లీ నుంచి రాష్ట్ర అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్షిస్తారు.

పోర్టల్​లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిన 24 అంశాలు ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖలు పొందుపరిచిన మరో 13 అంశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, పెండింగ్ లో ఉన్న బీఆర్​జీఎఫ్ నిధులు, ఎన్డీఆర్ఎఫ్ నిధులపై చర్చ జరగనుంది. ఐటీఐఆర్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు, కొత్త విమానాశ్రయాలు, ఐఐఎం ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షలో చర్చిస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.